విద్యుదాఘాతంతో రైతు మృతి

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ మండలం జాలుబాయితండాలో గురువారం విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…జాలుబావితండాకు చెందిన జర్పుల లింగునాయక్ (32) తనకున్న ఎకరన్నర పొలంతో పాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నాడు.

 Farmer Died Due To Electric Shock , Jarpula Lingunayak, Electricity Service-TeluguStop.com

తాను సాగుచేస్తున్న పొలం వద్ద బోరు మోటారుపై పడి ఉన్న విద్యుత్తు సర్వీస్ వైరును గమనించక మోటారు వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై లింగునాయక్ శరీరం కొంత మేర కాలిపోయింది.దీంతో వెనుక నుంచి వస్తున్న భార్య మంగను దగ్గరికి రావద్దంటూ గట్టిగా అరువగా పక్కనే ఉన్న రైతులు కూడా అక్కడికి వచ్చి లింగునాయక్ వెంటనే మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

మృతుడికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.భాదిత కుటుంబం పెద్దదిక్కును కోల్పోవడంతో విషాదంలో మునిగిపోయింది.

మృతుడి తండ్రి బాషాసింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube