ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టుకు ఎస్బీఐ ఇచ్చిన నివేదిక బహిర్గతం అయింది.ఎస్బీఐ ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసిందని తెలుస్తోంది.
ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది.భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఈసీ బయట పెట్టిందని సమాచారం.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు రిజస్ట్రీ పంపిన డేటాను తమ వెబ్సైట్ లో సీఈసీ అప్లోడ్ చేసింది.







