ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న అతి పెద్ద మెసేజింగ్ యాప్ గా వాట్సప్ కు( WhatsApp ) ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే.రోజురోజుకు వాట్సప్ ఉపయోగించే వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుంది.
వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.గత కొంతకాలంగా ఎన్నో అద్భుతమైన ఫీచర్లు వాట్సప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.
వాట్సాప్ లో పొరపాటున కొన్ని చాటలను( WhatsApp Chat ) డిలీట్ చేసి, బాధపడుతుంటాము.అయితే పొరపాటున డిలీట్ చేసిన చాట్ ను రికవరీ చేయొచ్చని మీకు తెలుసా.? డిలీట్ అయిన చాట్ ను ఎలా రికవరీ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
చాట్లను డిలీట్ చేయడానికి ముందు బ్యాకప్ ను( Backup ) ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది.వాట్సప్ బ్యాకప్ ను ఎనేబుల్ చేసిన తర్వాత డిలీట్ అయిన వాట్సాప్ చాట్ రికవరీ( WhatsApp Chat Recovery ) సులభంగా చేయవచ్చు.ముందుగా వాట్సప్ యాప్ ఓపెన్ చేసి, అక్కడ కనిపిస్తున్న మోర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
ఇక సెట్టింగ్ లోకి వెళితే అక్కడ చాట్స్ కనిపిస్తుంది దానిని ఎంచుకోవాలి.ఆ తర్వాత చాట్ బ్యాకప్ ఎంచుకోవాలి.అనంతరం బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ క్లిక్ చేయాలి.
ఇలా చేసిన తర్వాత బ్యాకప్ ఫ్రీక్వేన్సీని సెటప్ చేయాల్సిన కొత్త పేజీకి రీ డైరెక్ట్ అవుతారు.ఆ తర్వాత బ్యాకప్ ఫ్రీక్వేన్సీని సెట్ చేసి, మీ బ్యాకప్ చాట్ హిస్టరీని స్టోర్ చేయాలనుకుంటున్న గూగుల్ ఖాతాను ఎంచుకోవాలి.మీ డివైజ్ కు కనెక్ట్ చేసి ఉన్న గూగుల్ ఖాతా లేనట్లయితే, add account ఆప్షన్ ఎంచుకోవాలి.
ఇక్కడ మీ లాగిన్ వివరాలు నమోదు చేసి బ్యాకప్ ఓవర్ ఎంచుకోవాలి.ఆ తర్వాత బ్యాకప్ కోసం మీరు ఉపయోగించాలి అనుకుంటున్న నెట్వర్క్ ఎంచుకోవాలి.అంతే వాట్సాప్ చాట్ బ్యాకప్ ప్రారంభం అవుతుంది.దీంతో మీరు పొరపాటున డిలీట్ చేసిన చాట్ మళ్లీ పొందవచ్చు.