సావిత్రి జీవితం చాలావరకు తెరిచినా పుస్తకమే.ఎంత మాట్లాడుకున్న జనాలకు తెలియని కొన్ని విషయాలు మరుగున పడుతూనే ఉంటాయి.
మహానటి సినిమా( Mahanati ) తర్వాత ఈ తరం వారికి సావిత్రి( Savitri ) అంటే ఇలా కూడా ఉంటుందా అనే పరిచయం చేయబడి ఆమె జీవితాన్ని విశ్లేషించి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతక కూడదో తెలియచేసింది.అయితే ఎవరికీ తెలిసిన విషయం వారు వారి కోణంలో సావిత్రి గురించి చెప్పారు.
కానీ ఆమె కొడుకు 16 ఏళ్ళ వయసులో సావిత్రిని కోల్పోయి ఏమి తెలుసుకున్నాడు అనే విషయం మాత్రం ఎవరికి తెలియదు.అతడి మాటల్లో అమ్మ గురించి కొన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అమ్మ అందరి అమామల్లాగే మా జీవితాల్లో ముఖ్య పాత్రను పోషించింది.ఆమె తెరపై నటించే పాత్ర కాదు జీవితంలో జీవించే పాత్ర.సావిత్రి అంటే కొడుకు సతీష్( Satish ) దృష్టిలో ఎంతో ఉన్నతమైన వ్యక్తి.అందరు సావిత్రి కొడుకుగా( Savitri Son ) గుర్తిస్తుంటే ఎక్కడలేని ఒక గర్వం.
ఆమె ఎప్పుడు వారికోసం పాటు పడింది.అలాగే ఎంత పెద్ద సమయ ఉన్న అచంచలమైన ఆత్మవిశ్వాసం కూడా ఉండేదట ఆమెలో.
సతీష్ ని ఇంజనీర్ ని చేయాలనీ సావిత్రి అనుకునేది.అలాగే కూతురిని డాక్టర్ ని చేయాలనీ అనుకునేదట.
మంచి లో కేవలం మంచిని మాత్రమే చూడాలని, చెడులో చెడును చూడకూడదు అని ఎప్పుడు చెప్పేదట.
1980 లలో సావిత్రి తో కలిసి చెన్నై లో( Chennai ) కూరగాయల మార్కెట్ లో ఎన్నోసార్లు తిరిగేవారట.అమ్మది ఎడమచేతి వాటం ఆ లక్షణాలు మొత్తం ఇప్పుడు నా కొడుకు లో ఉన్నాయ్.అతడు కూడా ఎడమ చేతి వాటం కలవాడు.
అలాగే అమ్మ అనుకున్నది ఎలాగైతే చేసేదో అదే మొండితనం ఇప్పుడు నా కొడుకులో చూస్తున్న.వాడిని చుసిన ప్రతిసారి అమ్మను చూసినట్టే అనిపిస్తుంటుంది అని చెమర్చిన కళ్ళతో సతీష్ చెప్పారు.
అమ్మకు చెస్ బాగా ఆడటం వచ్చు.బాడ్మెంటన్ కూడా బాగా ఆడుతుంది.పేకాటలో “లిటరేచర్’ అనే ఆట అమ్మ చక్కగా ఆడేది.షిర్లీ మాక్లియన్ కీ మా అమ్మ అంటే ఎంతో ఇష్టం.ఒకసారి ఇంటికి వచ్చి కలిసి వెళ్ళింది.అమ్మకు సంబందిచిన సినిమాలన్నీ చూడాలని, వాటిని అన్ని ఒక చోట చేర్చి లైబ్రరీ చేయాలనీ కోరిక ఉంది.
అమ్మ చుట్టూ ఉన్నవాళ్ళు ఆమెను వెన్నుపోటు పొడిచారు.మెల్లిగా ఆరోగ్యం పోయింది.
ఇన్కమ్ టాక్స్ గొడవల్లో ఆస్తి పోయింది.చివరికి ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది.