సౌదీ షాకింగ్ డెసిషన్...ఆందోళనలో భారతీయులు

భారతీయులకి విదేశాలలో గడ్డు పరిస్థితి ఎదురవుతోంది.అధికసంపాదన కోసం విదేశాలు వెళ్ళిన వారికి ఎదో ఒక రూపంలో అక్కడ ఆంక్షలు పెరిగిపోతున్నాయి.

అమెరికాలో విసాల రూపంలో ఆంక్షలు భారతీయులు ఇబ్బందులు ఎదుర్కుంటుంటే సౌదీ లో భారతీయులు పన్నుల రూపంలో ఇబ్బందులని ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురయ్యింది.అయితే ఇదే పరిస్థితి సౌదీ లో కొనసాగితే భారతీయులు మళ్ళీ భారత్ వచ్చేసే పరిస్థితి ఉంటుందని అంటున్నారు నిపుణులు వివరాలలోకి వెళ్తే.

సౌదీ ప్రభుత్వం పెరిగిపోతున్న వలసదారుల జనాభాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.దాంతో చాలా మంది వలస దారులు ముఖ్యంగా భారతీయులు ఇది తమకెంతో భారం అని అంటున్నారు.సౌదీ కి అనేక దేశాల నుంచీ ఎంతో మంది వలసలు వెళ్తారు వారిలో ముఖ్యంగా అధిక సంఖ్యలో భారతీయులు ఉండటం గమనార్హం.

అయితే ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి 200 సౌదీ రియాల్స్ ప్రతి వలసదారుడి కుటుంబసభ్యుడిపై ప్రభుత్వం పన్నుగా వసూలు చేయబోతోంది.అయితే గతంలో కేవలం 100 రియాల్స్ మాత్రమే వసూలు చేసేవారు ప్రతీ ఏటాజూలై 1 వ తేదీన 100 రియాల్స్ పెంచుతూపోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు.2019లో ప్రభుత్వం ప్రతి వలసదారుడి కుటుంబ సభ్యుడిపై దాదాపు 300 రియాల్స్ వసూలు చేయనుంది సౌదీ ప్రభుత్వం.అయితే సౌదీ ఈ నిర్ణయం వలన అధికశాతం ఇబ్బంది పాడేది భారతీయులే ఐతే ఇదే ఇదే తరహా పన్ను కట్టాలి అంటే మా వల్ల కాదు ఇదంతా వలసదారులు అయిన మమ్మల్ని వెనక్కి పంపడానికి చేస్తున్న కుట్ర అని వలసదారుల సంఘాలు తమ భాదని వ్యక్తపరిస్తున్నారు.

Advertisement
నిజ్జర్ హత్య కేసు : ఆ నలుగురు భారతీయులు కస్టడీలోనే, మళ్లీ నోరు పారేసుకున్న కెనడా
Advertisement

తాజా వార్తలు