కన్నడ పలితాలతో అతిగా సంతోష పడుతూ గాల్లో విహరిస్తున్న కాంగ్రెస్ శ్రేణులను నెలమీదకు దించే ప్రయత్నం చేశారు ఆ పార్టీ కీలక నేత, తిరువనంతపురం ఎంపి శశి థరూర్( MP Shashi Tharoor ).కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూసి తమ గెలుపును అతిగా ఊహించుకోవద్దంటూ హితవు పలికారు అసెంబ్లీ ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు మధ్య చాలా తేడా ఉంటుందని ప్రజలు కూడా ఆ తేడా చూపిస్తారని, వాపును చూసి బలుపు అనుకుంటే అసలుకే మోసం వస్తుందంటూ ఆయన కాంగ్రెస్ శ్రేణులను హెచ్చరించారు .
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దేశం మొత్తం అధికారంలోకి వచ్చేస్తామన్నది అతి ఆత్మవిశ్వాసం కిందకు వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు .రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ( Rahul Gandhi ,Priyanka Gandhi ) విస్తృత ప్రచారం కర్ణాటకలో కాంగ్రెస్( Congress in Karnataka ) విజయానికి ఒక కారణంగా పని చేసి ఉండొచ్చేమో కానీ ఈ స్థాయి భారీ మెజారిటీకి మాత్రం అక్కడ స్థానిక నేతల కష్టమే కారణమంటూ ఆయన చెప్పుకొచ్చారు.
గ్రౌండ్ లెవెల్ లో వారు ప్రజలను ఆకట్టుకోవడానికి పని చేసినందు వల్లే ఈ ఫలితాలు వచ్చాయని అదే విధంగా దేశం మొత్తం ప్రజలు నమ్మకాన్ని గెలుచుకునే పనులు చేస్తేనే సరైన ఫలితాలు వస్తాయని ఆయన సూచించారు .గత ఎన్నికలలో కర్ణాటకలో మంచి ఫలితాలు సాధించి మధ్యప్రదేశ్, రాజస్థాన్( Madhya Pradesh, Rajasthan ) ను గెలుచుకున్న కూడా ఆ తర్వాత లోక్సభ ఎన్నికలలో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయామని.కర్ణాటక లో ఒక్క ఎంపి పరిమితం అయిపోయామని ఈసారి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజాభిప్రాయాన్ని గెలుచుకోవాలంటూ ఆయన కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు .
మోడీ అమిత్ షా విపరీతంగా కర్ణాటకలో ప్రచారం చేసినప్పటికీ వారు వచ్చి కర్ణాటకను పాలించరు అన్న అంచనాలతోనే ఓటరు వారికి దూరం చేరిగాడని కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సమీకరణలు మారతాయని ప్రజలకు ఆ తేడా తెలుసని సరైనవ్యూహాలతో సిద్ధమవ్వాలని ఆయన సూచించారు
.