ఊహ లోకంలో విహరించకండి-శశి థరూర్
TeluguStop.com
కన్నడ పలితాలతో అతిగా సంతోష పడుతూ గాల్లో విహరిస్తున్న కాంగ్రెస్ శ్రేణులను నెలమీదకు దించే ప్రయత్నం చేశారు ఆ పార్టీ కీలక నేత, తిరువనంతపురం ఎంపి శశి థరూర్( MP Shashi Tharoor ).
కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూసి తమ గెలుపును అతిగా ఊహించుకోవద్దంటూ హితవు పలికారు అసెంబ్లీ ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు మధ్య చాలా తేడా ఉంటుందని ప్రజలు కూడా ఆ తేడా చూపిస్తారని, వాపును చూసి బలుపు అనుకుంటే అసలుకే మోసం వస్తుందంటూ ఆయన కాంగ్రెస్ శ్రేణులను హెచ్చరించారు .
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దేశం మొత్తం అధికారంలోకి వచ్చేస్తామన్నది అతి ఆత్మవిశ్వాసం కిందకు వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు .
రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ( Rahul Gandhi ,Priyanka Gandhi ) విస్తృత ప్రచారం కర్ణాటకలో కాంగ్రెస్( Congress In Karnataka ) విజయానికి ఒక కారణంగా పని చేసి ఉండొచ్చేమో కానీ ఈ స్థాయి భారీ మెజారిటీకి మాత్రం అక్కడ స్థానిక నేతల కష్టమే కారణమంటూ ఆయన చెప్పుకొచ్చారు.
"""/" / గ్రౌండ్ లెవెల్ లో వారు ప్రజలను ఆకట్టుకోవడానికి పని చేసినందు వల్లే ఈ ఫలితాలు వచ్చాయని అదే విధంగా దేశం మొత్తం ప్రజలు నమ్మకాన్ని గెలుచుకునే పనులు చేస్తేనే సరైన ఫలితాలు వస్తాయని ఆయన సూచించారు .
గత ఎన్నికలలో కర్ణాటకలో మంచి ఫలితాలు సాధించి మధ్యప్రదేశ్, రాజస్థాన్( Madhya Pradesh, Rajasthan ) ను గెలుచుకున్న కూడా ఆ తర్వాత లోక్సభ ఎన్నికలలో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయామని.
కర్ణాటక లో ఒక్క ఎంపి పరిమితం అయిపోయామని ఈసారి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజాభిప్రాయాన్ని గెలుచుకోవాలంటూ ఆయన కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు .
"""/" /
మోడీ అమిత్ షా విపరీతంగా కర్ణాటకలో ప్రచారం చేసినప్పటికీ వారు వచ్చి కర్ణాటకను పాలించరు అన్న అంచనాలతోనే ఓటరు వారికి దూరం చేరిగాడని కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సమీకరణలు మారతాయని ప్రజలకు ఆ తేడా తెలుసని సరైనవ్యూహాలతో సిద్ధమవ్వాలని ఆయన సూచించారు
.
ఆమె నన్ను ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా మార్చింది : హీరో సూర్య