తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడం తో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ కు నాలుగేళ్ళ జైలు శిక్ష విధించడం తో ప్రస్తుతం బెంగుళూరు లోని పరప్పన అగ్రహార జైలు శిక్ష అనుభవిస్తున్నారు.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
నాలుగేళ్ల జైలుశిక్ష
, రూ.10 కోట్ల జరిమానాకు గురైన శశికళ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి పరప్పణ అగ్రహార జైలు లోనే శిక్ష అనుభవిస్తూ వస్తున్నారు.అయితే 2021 ఫిబ్రవరి నాటికి ఆమె శిక్షా కాలం పూర్తి కావాల్సి ఉండగా దానికంటే కొద్దీ రోజుల ముందే చిన్నమ్మ జైలు నుంచి విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే చిన్నమ్మ కు విధించిన జరిమానా ను కూడా కోర్టుకు చెల్లించినట్లు కూడా తెలుస్తుంది.
అయితే చిన్నమ్మ విడుదల పై కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.కోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానా చెల్లించినా.ఆమె ముందుగా విడుదలయ్యే ఛాన్స్ లేనట్టే అన్నట్లుగా మంత్రి గారి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సాధ్యమైనంత తొందరగా శశికళ బెంగళూరు పరప్పన జైలు నుంచి విడుదలవుతారనే వార్తల నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.అవినీతి నిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందంటూ వ్యాఖ్యానించారు.
నాలుగేళ్లు జైలు జీవితం గడపాల్సిన చిన్నమ్మ సత్ప్రవర్తన కారణంగా ముందుగానే జైలు నుంచి విడుదల కానున్నట్లు జైలు అధికారులు వెల్లడించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంత్రిగారు మాట్లాడుతూ ఈ నేరాలకు సత్ప్రవర్తన వర్తించదని స్పష్టం చేశారు.ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. బసవరాజ్ వ్యాఖ్యలతో శశికళ అభిమానులు డీలా పడిపోయారు.
కోర్టు తీర్పు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో నాలుగేళ్ల శిక్షాకాలం ముగుస్తుంది.అలాంటిది చిన్నమ్మ ముందుగానే జైలు నుంచి విడుదల కానున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.
వచ్చే ఏడాది తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడం తో చిన్నమ్మ విడుదల మేటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.