బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్( Sarukh khan ) జీరో సినిమా తర్వాత కెరీర్ లో జీరో అయ్యాడని అంతా భావించారు.ఆయన నుంచి ఇక ముందు వచ్చే సినిమా లు కూడా జీరో నే అవ్వడం ఖాయం అని కూడా చాలా మంది భావించారు.
కానీ జీరో నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన బాద్ షా మళ్లీ జీరో నుంచి తాను సూపర్ స్టార్ ను అని పఠాన్ సినిమా ( Pathaan )తో నిరూపించుకున్నాడు.

పఠాన్ సినిమా ఫలితం తర్వాత వచ్చిన జవాన్ సినిమా ( Jawan Movie )ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో అనే అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.పఠాన్ సినిమా గాలి వాటున వచ్చిన విజయం కాదని నిరూపితం చేస్తూ జవాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.పఠాన్ సినిమా తో పాటు జవాన్ సినిమా కూడా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసి రికార్డు బ్రేక్ చేసిన విషయం తెల్సిందే.
ఒకే ఏడాది రెండు సినిమా లతో వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసిన రికార్డు ను ఇప్పటికే షారుఖ్ నమోదు చేసుకున్నాడు.ఇప్పుడు ఆ రికార్డ్ ను మరింత పదిలం చేసుకోవాలని షారుఖ్ ఉవ్విల్లూరుతున్నాడు.
షారుఖ్ ఖాన్ తన డంకీ సినిమా తో వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తే కచ్చితంగా అరుదైన రికార్డ్ గా చెప్పుకోవచ్చు.

ఒకే ఏడాది ఒకే హీరో నుంచి వచ్చిన మూడు సినిమా లు వెయ్యి కోట్లు అనేది భవిష్యత్తులో కచ్చితంగా సాధ్యం కాకపోవచ్చు.ఈ మధ్య కాలం లో ఏడాది లో కనీసం రెండు సినిమా లు కూడా ఒక స్టార్ హీరో చేయలేక పోతున్నాడు.అలాంటిది షారుఖ్ ఖాన్ ఏకంగా మూడు సినిమా లు చేయడం.
ఆ మూడు సినిమా లు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం అనేది మరింత పెద్ద రికార్డ్ గా నిలువబోతుంది.అందుకే డంకీ సినిమా( Dunki movie ) ఫలితం పై అంతా ఆసక్తిగా ఉన్నారు.
సలార్ పోటీ ఉండటం వల్ల డంకీ సినిమా వెయ్యి కోట్ల మార్క్ దాటదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి షారుఖ్ ఆ అరుదైన రికార్డ్ ను నమోదు చేసేనా చూడాలి.