కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన మొదటి రోజుల్లో ఈ టీకా అంటే చాలా మందిలో భయం ఉండేది.కానీ ప్రస్తుత పరిస్దితుల్లో మాత్రం కోవిడ్ టీకాను ఎందరో ఇప్పించుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే వ్యాక్సిన్ వేసుకున్న కొత్తలో కొంత ఆందోళన పరిస్దితులు నేలకొనగా, కొన్ని మరణాలు కూడా సంభవించాయి.మరి ఈ చావులకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమనే విషయం పై ఇప్పటికి సృష్టత లేదు.
ఇకపోతే తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం లింగధన గ్రామ మహిళా సర్పంచ్ మయూరి(42) ఆకస్మికంగా మృతి చెందడంతో మరోసారి కోవిడ్ వ్యాక్సిన్ పై వార్తలు వస్తున్నాయి.ఇక అసలు విషయం ఏంటంటే.
ఈ నెల 12 వ తేదీన మయూరి కేశంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారట.కాగా ఆ రోజు నుంచి అనారోగ్యంతో మయూరి బాధపడుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో బుధవారం రాత్రి అకస్మాత్తుగా పల్స్ పడిపోగా చికిత్స నిమిత్తం హుటాహుటిన మయూరిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు గ్రామస్థుల కధనం.
అయితే మయూరి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు వైద్యులు సిద్దం అయ్యారట.
ఇక ఈ మృతికి వ్యాక్సిన్ కారణమా? లేక ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియవలసి ఉంది.