సూపర్ స్టార్ మహేశ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్

అనీల్ రావుపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది.

 Sarileru Neekevvaru 1st Song Mind Block Release Date-TeluguStop.com

ఇక ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో చేస్తూ ఉండటంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.అనిల్ రావిపూడి స్టైల్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది అని టీజర్ బట్టి అర్ధమైపోయింది.

ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడీగా రష్మిక మందన నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ “మైండ్ బ్లాక్” అనే మాస్ సాంగ్ ను రేపు అనగా డిసెంబర్ 2వ తేదీన సాయంత్రం 5 గంటలకి ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా డేట్ ఫిక్స్ చేసేసారు.జనవరి 5 వ తేదీన భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని, అది కూడా భారీ ఎత్తున జరగాలని మహేష్ బాబు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

మరి భారీ అంచనాల మధ్య పండగకి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా అనిల్ రావిపూడి స్టైల్ లో మరో ఫుల్ మీల్స్ సినిమాగా ఉండబోతుందా అనేది చూడాలంటే వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube