ప్రియాంక ఘటనపై స్పందించిన కేసీఆర్

షాద్ నగర్ లో జరిగిన ప్రియాంకా రెడ్డి అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా స్పందించారు.గత నాలుగు రోజులుగా సంచలనంగా మారిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వినిపిస్తున్నాయి.

 Cm Kcr Reacts On Priyanka Incident-TeluguStop.com

మహిళా లోకం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ప్రియాంకని చంపిన మానవ మృగాలకు నడిరోడ్డు మీద ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.అదే సమయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలలో మార్పు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఇప్పటికి కూడా ప్రియాంక రెడ్డి మరణంపై తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.

మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదని విమర్శలు వినిపించాయి.

ఈ నేపధ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రియాంక ఉదంతంపై తన ఆవేదనను వ్యక్తం చేశారు.ఇది అత్యంత అమానుషమైన దుర్ఘటన అని అన్నారు.మహిళలు రాత్రి పూట ఉద్యోగులకు వెళ్లవద్దని సూచించారు.మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయని, మహిళలు చాలా జాగ్రత్తలు కోవాలని అన్నారు.

తమ మొబైల్ లో 100 నెంబర్ తప్పక ఉంచుకోవాలని, అత్యవసర సమయాలలో 100కి కచ్చితంగా ఫోన్ చేయాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube