ఢిల్లీ లిక్కర్ స్కామ్‎లో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు‎లో ఈడీ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల కస్టడీ ముగియడంతో వారిని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు.

ఈ మేరకు వారి కస్టడీని మరో నాలుగు రోజులపాటు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.అయితే ఈడీ కస్టడీ పొడిగింపుపై శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీనిపై గత కస్టడీలో బినోయ్ నుంచి పలు ఆధారాలు సేకరించినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది.అదేవిధంగా ఇటీవల నిర్వహించిన సోదాల్లో డిజిటల్ ఆధారాలు దొరికాయని వెల్లడించింది.

తమ విచారణకు శరత్ చంద్రారెడ్డి సహకరించడం లేదని న్యాయస్థానానికి ఈడీ వివరించింది.

Advertisement
చైనా: వామ్మో, రైతుపై విరుచుకుపడిన పెద్ద పులి.. వీడియో చూస్తే..

తాజా వార్తలు