సాధారణంగా అభిమానులు వారి అభిమాన సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.కేవలం సినీ సెలబ్రిటీలకు మాత్రమే కాకుండా క్రికెటర్లకు సంబంధించిన విషయాలను కూడా తెలుసుకోవడానికి తాపత్రేయ పడుతూ ఉంటారు.
సినిమాలను ప్రేక్షకులు ఏ విధంగా అయితే ఇష్టపడతారో అదే విధంగా క్రికెట్ ని కూడా అమితంగానే ఇష్టపడతారు.కాగా ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది క్రికెటర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరికొందరు రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే.
అయితే ఇవన్నీ కూడా మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు కానీ ఎప్పుడో ఒకసారి బయటపడేస్తుంది.
తాజాగా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ కూడా అలాగే అడ్డంగా బుక్ అయ్యాడు.
బాలీవుడ్ డ్యూటీ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ తో కలిసి ఒక హోటల్లో స్టే చేసి అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోయాడు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ సారా టెండూల్కర్, శుబ్ మన్ గిల్ ప్రేమించుకుంటున్నారని, పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ గతంలో జోరుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా సారా పెట్టిన పోస్ట్ లపై కూడా శుబ్ మన్ గిల్ స్పందిస్తూ వాటికి హార్ట్ సింబల్ వేసి లవ్ కామెంట్స్ చేయడంతో వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు అన్నది రుజువయింది.అంతేకాకుండా వాళ్ళు త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు కొనసాగాయి.ఆ వార్తలపై వారిద్దరూ కూడా స్పందించలేదు.
అయితే సారా టెండుల్కర్ కి బ్రేకప్ చెప్పేసిన శుబ్ మన్ గిల్, ప్రస్తుతం సారా అలీ ఖాన్ తో కలిసి ప్రేమను నడిపిస్తూ ఆమెతో కలిసి చిట్కా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు.ఈ నేపథ్యంలోనే తాజాగా ముంబైలో ఒక హోటల్లో బస చేసిన తర్వాత ఇద్దరూ కలిసి ఒకే ఫ్లైట్ లో పక్క పక్కన కూర్చుని వెళ్లారు.
ఎందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.