రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాత్యులు డా.
తానేటి వనిత గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అదేవిధంగా సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రుడా చైర్ పర్సన్ షర్మిలా, కలెక్టర్ మాధవీ లత, స్థానిక వైస్సార్సీపీ నాయకులు, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, ఆటపాటలు, ఎద్దుల బండ లాగు పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని హోంమంత్రి తానేటి వనిత గారు పేర్కొన్నారు.వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను హోంమంత్రి డా.తానేటి వనిత గారు తెలిపారు.