కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ (Thalapathy Vijay) ఒకరు.ఈయన సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తూనే ఉంటారు.
ఈ ఏడాది అప్పుడే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వారిసు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విజయ్ వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయడమే కాకుండా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

ప్రస్తుతం విజయ్ నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా ‘లియో’ (LEO) .లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి.ఈ సినిమా ఇటీవలే యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ చేసినట్టు టాక్.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను చేస్తున్నాడు.
దీంతో హైప్ భారీగా ఉంది.
ఇక ఈ ప్రాజెక్ట్ లో వివిధ బాషలలో స్టార్స్ భాగం అయ్యారు.అందులో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కూడా ఉన్నారు.
ఈయన కీ రోల్ లో నటిస్తున్నాడు.మరి ఆయన చేస్తున్న రోల్ గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో విజయ్ తండ్రి పాత్రలో సంజయ్ కనిపిస్తాడని టాక్.

అంతేకాదు ఈయన 1940 సమయంలో గ్యాంగ్ స్టర్ గా చుపించ బోతున్నారట.దీంతో లోకేష్ ఈ పాత్రను ఎంత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దుతున్నాడో అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా పక్కా హిట్ అని ఇప్పటికే ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.







