భారీగా పడిపోయిన శానిటైజర్ అమ్మకాలు.. అదే కార‌ణ‌మా?

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను ఇంత‌లా వ‌ణికిస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగు చూసిన ఈ క‌రోనా వైర‌స్.

అంత‌కంత‌కూ విజృంభిస్తూ ప్ర‌పంచ‌దేశాలు ఆక్ర‌మించింది.ఈ క్ర‌మంలోనే ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ కోర‌ల్లో చిక్కుకుని ఇప్ప‌టికే తొమ్మ‌ది ల‌క్ష‌ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇక క‌రోనా వేగంగా విజృంభిస్తున్న వేళ‌.మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం, శానిటైజ‌ర్లు యూజ్ చేయ‌డం వంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ప్రజ‌లు క‌రోనా వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ పొంద‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

‌అయితే ప్ర‌స్తుతం శానిటైజ‌ర్ అమ్మ‌కాలు భారీగా ప‌డిపోయాయి.క‌రోనా వైర‌స్ ప్రారంభం అయ్యాక‌.

Advertisement

శానిజైటర్ లను కొనేందుకు ఎగబడ్డారు.క‌రోనా భ‌యంతో ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలు ఇలా ఎక్కడికి వెళ్లినా శానిటైజ‌ర్‌ను మాత్రం వెంటే పెట్టుకునేవారు.

ఈ క్ర‌మంలోనే వీటి అమ్మకాలు, ధ‌ర‌లు భారీగా పెరిగిపోయాయి.అయితే ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో జ‌రిగిన అమ్మ‌కాల‌తో పోలిస్తే.

ఇప్పుడు భారీగా శానిటైజ‌ర్ల అమ్మ‌కాలు ప‌డిపోయాయి.ఇక ధ‌ర‌లు త‌గ్గించినా.

శానిటైజ‌ర్ల‌ను కొనేవాళ్లే క‌రువైనట్టు ప‌రిస్థితి ఏర్ప‌డింది.దాదాపు 2 వేల వరకూ అమ్మిన శానిటైజర్ క్యాన్ ధర.రూ.400కు పడిపోయినా ప్ర‌జ‌లు కొనుగోలు చేసేందుకు ముందుకు రావ‌డం లేదు.అయితే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం కరోనా వైర‌స్ వచ్చిన తొలి రోజుల్లో ఉన్న భయం క్రమంగా ప్రజల్లో తగ్గిపోవ‌డ‌మే అని విశ్లేష‌కులు అంటున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

కరోనా కూడా ఓ సాధార‌ణ‌ జ్వరంలాగానే తగ్గుతుందని భావిస్తున్న ప్ర‌జ‌లు.క‌రోనాపై భ‌యాన్ని వ‌దిలేశారు.వీరి న‌మ్మ‌కానికి బ‌లాన్ని చేకూరుస్తూ.

Advertisement

రిక‌వ‌రీ రేటు కూడా పెరుగుతోంది.ఈ క్ర‌మంలోనే శానిటైజర్లు కొనేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూప‌డం లేద‌ని చెబుతున్నారు.

దీంతో శానిటైజ‌ర్ల అమ్మ‌కాలు భారీగా ప‌త‌న‌మ‌య్యాని చెబుతున్నారు.

తాజా వార్తలు