సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి( Congress MLA Jagagreddy ) బీ అర్ ఎస్ లో చేరుతున్నారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.ఇక దీనికి తగ్గట్లుగానే ఆయన అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ పైన, కేటీఆర్ పైన , ప్రభుత్వం పనితీరుపైన ప్రశంసలు కురిపిస్తూ రావడంతో జగ్గారెడ్డి చేరిక లాంఛనమే అని అంతా భావించారు.
ఇక మరికొద్ది రోజుల్లో ఆయన బీఆర్ఎస్ కండువా( BRS ) కప్పుకోబోతున్నారనే హడావుడి నడిచింది.అయితే ఈ వ్యవహారాలపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు.
పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించారు.కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీ ఆర్ ఎస్ లోకి వెళ్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని, అదంతా అబద్ధం అంటూ క్లారిటీ ఇచ్చారు .

తనకు రాజకీయ శీలపరీక్ష అవసరం లేదని, తన రాజకీయ ప్రయాణం రాహుల్ గాంధీ( Rahul Gandhi )తోనే కొనసాగుతుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.” నేను పార్టీ మారుతున్నానని ప్రచారం చేయడం కొందరికి ఆనందం కలిగిస్తోంది.జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దా ? నా వ్యక్తిత్వం పై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ? సోషల్ మీడియా( Social Media )లో ప్రచారానికి ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు ? నేను కన్నెర్ర చేస్తే ఈ దుష్ప్రచారం చేస్తున్నవారు ఉంటారా ? అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తే నడిరోడ్డుపై బట్టలు విప్పి నిలబెడతానని జగ్గారెడ్డి హెచ్చరించారు.ఈ సందర్భంగా టిడిపి పైన విమర్శలు చేశారు.

సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తెలుగుదేశం పార్టీ సంస్కృతి( TDP ) అని , అక్కడి నుంచే ఇది కాంగ్రెస్ లోకి వచ్చిందని పరోక్షంగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పై జగ్గారెడ్డి విమర్శలు చేశారు.పార్టీ చేపడుతున్న ప్రతి కార్యక్రమంలోనూ తాను పాల్గొంటున్నానని, అయినా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, ఇలా చేయడం బాధ కలిగిస్తుందని, ఇప్పటికైనా ఆ మూర్ఖులు , దద్దమ్మలు తప్పుడు ప్రచారం మానేయాలని జగ్గారెడ్డి కోరారు.తెలంగాణలో కెసిఆర్ పై పోరాడిన మొదటి నాయకుడిని తానేనని , 2018 ఎన్నికల సమయంలో తనపై కేసులు పెట్టి జైలుకు పంపారని అయినా కొట్లాడి గెలిచానని జగ్గారెడ్డి అన్నారు.