ప్రణయ్ రెడ్డి వంగా( Pranai Reddy Vanga ) ఈ పేరు ఎంత మందికి తెలుసు.కానీ ఈ పేరు వింటుంటే సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga )మాత్రం గుర్తుకొస్తాడు.
సందీప్ రెడ్డి మరియు ప్రణయ్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు.ప్రణయ్ పెద్దవాడు కాగా సందీప్ రెడ్డి చిన్నవాడు.
సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమా తీయాలి అనుకున్న సమయంలో తనకు నిర్మాతల నుంచి అనేక సమస్యలు వచ్చాయి.ఎందుకంటే ఒక సినిమా కథను ప్రొడ్యూసర్ ప్రాపర్ గా అర్థం చేసుకోగలిగి అందుకు తగినంత లిబర్టీ ఇస్తే తప్ప దర్శకుడు తీయాలనుకున్న సినిమా తీయలేదు.
కథ నచ్చిన కూడా దానికి సంబంధించిన బడ్జెట్ నచ్చకపోయినా లేదంటే లొకేషన్స్ ప్రాబ్లం అయినా కాస్టింగ్ ఇబ్బందులు వచ్చిన ప్రొడ్యూసర్ కి ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా ఆ సినిమాపై దాని ఎఫెక్ట్ పడుతుంది.
అలాంటి సమస్యలు రాకూడదనికున్నాడో ఏమో తెలియదు కానీ సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ సందర్భంగా చాలామంది నిర్మాతలను ప్రయత్నించి విఫలమై తన సొంత అన్నయ్య ప్రణయ్ రెడ్డి నిర్మాణంలోనే ఆచిత్రాన్ని పూర్తి చేశాడు.ఆ సినిమాతో ఇద్దరు అన్నదమ్ములు మంచి సక్సెస్ ని కూడా సాధించారు.అయితే ప్రణయ్ రెడ్డి సందీప్ ని చాలా చక్కగా అర్థం చేసుకున్నాడట.
అతనికి కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చి వదిలేస్తాడట.అటు సైడ్ కూడా వెళ్లడానికి సాహసం చేయడంట.
అంత లిబర్టీ ఉంది కాబట్టే అప్పుడు అర్జున్ రెడ్డి అయినా ఇప్పుడు ఆనిమల్ సినిమా అయినా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అంటాడు సందీప్.
అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో రీమేక్ చేసిన కబీర్ సింగ్( Kabir Singh ) తప్ప మిగిలిన రెండు సినిమాలు కూడా తన సొంత అన్నయ్య ప్రణయ్ రెడ్డి నిర్మాణంలోనే సినిమాలు తీసాడు సందీప్ రెడ్డి వంగా.ఈ రెండు సినిమాలు కూడా ప్రణయ్ కి కాసుల వర్షాన్ని కురిపించాయి.అంతేకాదు తనకు ముందు ముందు మరిన్ని సినిమాలకు నిర్మాణం వహించడానికి కూడా ప్రయాణం సులువు చేసాయి.
ఇకపై ముందు రాబోతున్న సినిమాల్లో కూడా తన అన్న నిర్మాణంలోనే తెరకెక్కిస్తానంటూ సందీప్ చెప్తున్నాడు.బయట కొన్ని సంస్థలకు కమిట్మెంట్ ఇచ్చాడు కానీ అప్పుడప్పుడే అవి సాధ్యం కావాలని ఒకవేళ వేరే బ్యానర్ లో సినిమా చేయాల్సిన దాంట్లో కూడా ప్రణయ్ భాగస్వామ్యం ఉండేలా చూసుకుంటానంటున్నాడు.