అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సత్తా చాటిన వ్యక్తి సందీప్ రెడ్డి వంగా.ఆ సినిమాకి ముందు పెద్దగా దర్శకుడుగా ఎక్కువ అనుభవం లేకపోయినా, నేటి జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే విధంగా ప్రేమ కథని తనదైన శైలిలో ఆవిష్కరించి సత్తా చాటాడు.
ఈ సినిమా అతని క్రేజ్ ని అమాంతం పెంచేసింది.ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి రీమేక్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీఇచ్చి కబీర్ సింగ్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సందీప్ కి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ పడింది.
ఏకంగా ఈ సినిమా హిందీలో రెండు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసింది.ఇక బాలీవుడ్ లో తనకి వచ్చిన క్రేజ్ నేపధ్యంలో తన నెక్స్ట్ సినిమాని కూడా వంగా అక్కడే ప్లాన్ చేస్తున్నాడు.
దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.
ఈ సారి రెగ్యులర్ కమర్షియల్ జోనర్ లో కాకుండా సందీప్ రెడ్డి క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
ఇప్పటి వరకు రానటువంటి కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో తన తమ్ముడు ప్రవీణ్ వంగాని నిర్మాణ భాగస్వామిగా సందీప్ బాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడని తెలుస్తుంది.
ఇక ఓ ప్రముఖ హీరోగా ఈ సినిమా ఉంటుందని, త్వరలో దీనికి సంబందించిన అధికారిక ప్రకతాన వెలువడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత తన రెండో తెలుగు సినిమాని సందీప్ వంగా మొదలుపెదతాడని తెలుస్తుంది.