Sandeep Reddy Vanga: నా గీతాంజలి ఆ హీరోయిన్ లో కనిపించలేదు : సందీప్ రెడ్డి వంగ

ఆనిమల్ సినిమా( Animal Movie ) విడుదలైన తర్వాత వస్తున్న టాక్ గురించి సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారిపోయింది.సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) తీసిన ఈ సినిమా మ్యాడ్ గా ఉంది అంటున్నారు.

 Sandeep Reddy Vanga About Animal Heroine-TeluguStop.com

అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా, 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ సినిమాలోని హీరోయిన్ గురించి మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ట్రెండింగ్ లో ఉంది.అదేంటి అంటే రష్మిక మందన( Rashmika Mandanna ) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి ముందే మరొక అమ్మాయిని హీరోయిన్ గా తీసుకుని కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా చేశారట సందీప్ రెడ్డి వంగ.మరి ఆ హీరోయిన్ ఎవరు ? ఏ కారణాల చేత పక్కన పెట్టాల్సి వచ్చింది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Telugu Animal, Sandeep Vanga, Geetanjali Role, Ranbir Kapoor, Sandeepreddy-Movie

ఆనిమల్ సినిమా కోసం సందీప్ తోలుత అనుకున్న హీరోయిన్ పరిణితి చోప్రా.( Parineeti Chopra ) ఆమెను తీసుకుంది ఎందుకంటే ఆమె చాలా బాగా నటిస్తుందని, గ్రేట్ యాక్టర్ అని ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట.పైగా ఆ టైంకి ఆమెకు మార్కెట్ కూడా లేదు.

చాలా మంది పరిణీతి ఎందుకు కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, సక్సెస్ ఉన్నవాళ్లు ఉన్నారు కదా అని చెప్పినా కూడా ఎవరి మాట లెక్కచేయకుండా సందీప్ పరిణితి తో సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు.అయితే ఒక 12 రోజుల పాటు షూటింగ్ జరిగిన తర్వాత కానీ సందీప్ రెడ్డికి తన గీతాంజలి పాత్ర లో( Geetanjali Role ) కావాల్సిన లక్షణాలు పరిణితి లో లేవనే విషయం అర్థమైంది.

Telugu Animal, Sandeep Vanga, Geetanjali Role, Ranbir Kapoor, Sandeepreddy-Movie

దాంతో సినిమాకు మించి ఎవరు ముఖ్యం కాదు అని నిర్ణయించుకున్న సందీప్ నేరుగా పరిణితి చోప్రాకి వెళ్లి ఆ విషయం చెప్పేసాడట.“సారీ పరిణితి నీలో నా గీతాంజలి కనిపించడం లేదు” అనడంతో ఆమె ఒక్కసారిగా షాక్ గురైందట.కానీ కొంచెం సమయం తర్వాత తీరుకొని పర్వాలేదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయిందట.ఈ విషయం సందీప్ రెడ్డి తన సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో తెలియజేయడం విశేషం ఆ తర్వాత రష్మిక ని తీసుకొని ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడం కష్టం అది ఘన విజయం సాధించే దిశగా వెళుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube