అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సందీప్ రెడ్డి(Sandeep Reddy) ఇదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.అక్కడ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇకపోతే ఈయన రణబీర్ కపూర్( Ranabir Kapoor ) రష్మిక ( Rashmika ) హీరో హీరోయిన్లుగా యానిమల్ ( Animal ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఇక ఈ సినిమా ఇప్పటికీ భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది.ఇకపోతే ఈ సినిమాపై ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు వారి రివ్యూస్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ( Ram Gopal Varma ) సైతం ఈ సినిమా పట్ల చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.రాంగోపాల్ వర్మ యానిమల్ సినిమా పై తన రివ్యూ ఇవ్వడంతో సందీప్ రెడ్డి స్పందించారు.డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసినంత సేవా భారతీయ చిత్ర పరిశ్రమకు మరే డైరెక్టర్ చేయలేదనేది నా నమ్మకం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.నా ఆల్ టైం ఫేవరెట్ డైరెక్టర్ మీరే, మీ నుంచి నా యానిమల్ సినిమాకు రివ్యూ రావడం చాలా సంతోషంగా అనిపించిందని, సినిమాపై ఇలాంటి రివ్యూ అందించినందుకు సందీప్ రెడ్డి వంగ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఇక ఈ సినిమా కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ రాబట్టి భారీ స్థాయిలో కలెక్షన్లను అందుకుంది.రష్మిక ఇదివరకు పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన ఈమెకు ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయింది కానీ ఈ సినిమా ద్వారా మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందని చెప్పాలి.ఇక రష్మిక ఈ సినిమా మాత్రమే కాకుండా ప్రస్తుతం ఇతర భాష సినిమాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక యానిమల్ సినిమా మంచి హిట్ కావడంతో ఈమె పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం కానున్నారని తెలుస్తోంది.
.