Sundeep Kishan : డబ్బు కోసమే ఆ సినిమాలో నటించాల్సి వచ్చింది.. సందీప్ కిషన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలను ఎంచుకుని కెరీర్ పరంగా సక్సెస్ కావడానికి ఎంతో శ్రమిస్తున్న వాళ్లలో సందీప్ కిషన్( Sundeep Kishan ) ఒకరు.సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన( Ooru Peru Bhairavakona ) సినిమాలో నటించగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి.

 Sandeep Kishan Shocking Comments Goes Viral In Social Media Details Here-TeluguStop.com

ఫిబ్రవరి 16వ తేదీన సినిమా రిలీజవుతున్నా 14వ తేదీన పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించడం అంటే సాహసం అనే చెప్పాలి.అయితే కెప్టెన్ మిల్లర్( Captain Miller ) సినిమాలో ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో సందీప్ కిషన్ నటించారు.

కొన్ని సినిమాలలో ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించడం గురించి సందీప్ స్పందిస్తూ కరోనా సమయంలో తాను కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని వెల్లడించారు.ఆ సమయంలో స్టాఫ్ కు జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండాలని కెప్టెన్ మిల్లర్ సినిమాకు ఓకే చెప్పానని సందీప్ కిషన్ అభిప్రాయపడ్డారు.

Telugu Miller, Dhanush, Kollywood, Ooruperu, Sundeep Kishan, Tollywood, Varsha B

విరూపాక్ష సినిమా కోసం మొదట నన్ను సంప్రదించారని డేట్స్ విషయంలో ఎదురైన ఇబ్బందుల వల్ల ఈ సినిమాలో తాను నటించలేకపోయానని ఆయన చెప్పుకొచ్చారు.వర్ష బొల్లమ్మ( Varsha Bollamma ) తెలుగులో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఊరు పేరు భైరవకోన సినిమా సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాలి.ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతోంది.

Telugu Miller, Dhanush, Kollywood, Ooruperu, Sundeep Kishan, Tollywood, Varsha B

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్( Venkatadri Express Movie ) తర్వాత సందీప్ కిషన్ కు ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ దక్కలేదు.అయితే ఊరుపేరు భైరవకోన సినిమాతో ఆ లోటు తీరుతుందేమో చూడాల్సి ఉంది.గరుడ పురాణంలో మిస్సైన నాలుగు పేజీలకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.

సందీప్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.సందీప్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube