సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న కళ్యాణ్ రామ్ హీరోయిన్

చిత్రపరిశ్రమకి చెందిన చాలా మంది అందాల భామలు ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితం స్టార్ట్ చేశారు.

హీరోలు, హీరోయిన్లు అందరూ బజంత్రీలు మొగించేశారు.

టాలీవుడ్ లో నిఖిల్, నితిన్, రానా లాంటి హీరోలతో పాటు, కాజల్ అగర్వాల్ పెళ్లి పీటలు ఎక్కారు.మెగా డాటర్ నిహారిక వచ్చే నెలలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

అలాగే సౌత్ లో హీరోయిన్లుగా నటించిన చాలా మంది భామలు పెళ్లి చేసుకొని కొత్త జీవితాలు స్టార్ట్ చేశారు.తెలుగులో కళ్యాణ్ రామ్ కత్తి, మంచు మనోజ్ మిస్టర్ నూకయ్య సినిమాలలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ సనా ఖాన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసింది.

సౌత్ లో సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో ఈ అమ్మడుకి గుర్తింపు రాలేదు.దీంతో బాలీవుడ్ చెక్కేసి అక్కడ బిగ్ బాస్ షో ద్వారా కొంత గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

తరువాత ఓ అడల్ట్ కంటెంట్ బేస్ సినిమాలో నటించింది.అయితే అక్కడ కూడా ఆమెకి బ్రేక్ రాలేదు.

కొంత కాలం క్రితం వరకు బాలీవుడ్ లో ఓ డాన్స్ మాస్టర్ తో ప్రేమాయణం సాగించింది.అతనితో పెళ్లి పీటలు వరకు వెళ్లి సడెన్ గా అతనికి ఎక్స్ ట్రా ఎఫైర్స్ ఉన్నాయని బయట పెట్టడంతో అతనికి బ్రేక్ అప్ చెప్పేసింది.

తరువాత సడెన్ గా తాను సినిమాలకి గుడ్ బై చెప్పెస్తున్నట్లు అల్లా ఆజ్ఞ అనుసరించి ఇకపై ఆద్యాత్మిక మార్గంలో వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురించేసింది.అయితే ఇప్పుడు ఉన్నపళంగా గుజరాత్ లో ప్రముఖ వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్‌ను ఆమె పెళ్లాడారు.

భర్తతో సనాఖాన్‌ కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.ఈ నవదంపతులు నిఖా ముబారక్‌ అని రాసి ఉన్న కేక్‌ కట్‌ చేస్తున్న వీడియో కూడా వైరల్‌ అవుతోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కరోనా నేపథ్యంలో చాలా సింపుల్‌గా ముస్లిం సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు