మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ( Samyuktha Menon ) అంటే తెలియని సినీ ప్రేమికులు ఉండరు.ఈమె తెలుగులో చేసిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగులో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
ఇప్పటికే ఈమె చేసిన భీమ్లా నాయక్,బింబిసారా, సార్, విరూపాక్ష వంటి వరుస సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.అయితే త్వరలోనే అంటే డిసెంబర్ 29 న డెవిల్ ( Devil ) మూవీ తో మన ముందుకు రాబోతుంది.
ఇక అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే డెవిల్ సినిమానే సంయుక్త మీనన్ కి లాస్ట్ సినిమా కాబోతుంది అంటూ ఫిలిం సర్కిల్స్ లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.ఎందుకు ఈ హీరోయిన్ ఇప్పటినుండి సినిమాలో నటించదా? లేకపోతే వేరే ఇండస్ట్రీకి వెళ్తుందా అని ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అయితే అసలు విషయం ఏమిటంటే.సంయుక్త మీనన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం.అందుకే డెవిల్ సినిమా తనకి చివరి సినిమా కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.ఇక విషయంలోకి వెళ్తే.
మలయాళీ నటి సంయుక్త మీనన్ మలయాళం లో వచ్చిన పాప్ కార్న్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో రాణించింది.
ఇక తెలుగులో ఈమె భీమ్లా నాయక్ సినిమాలో విలన్ భార్య గా చేసింది.

ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ ( Trivikram ) సహాయంతో వరుస సినిమాల్లో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా మారిపోయింది.అయితే తాజాగా హీరోయిన్ పెళ్లిపీటలెక్కబోతుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.కేరళకు చెందిన సంయుక్త మీనన్ గత కొద్ది రోజులుగా ఓ అబ్బాయితో ప్రేమలో ఉందట.
ఇక ఈ విషయాన్ని సంయుక్త మీనన్ తన పేరెంట్స్ కి చెప్పగా వాళ్ళు కూడా ఓకే చేసిన్నట్టు తెలుస్తుంది.

అయితే సంయుక్త పెళ్లి చేసుకోబోయేది వేరే మతానికి చెందిన అబ్బాయి అని తెలుస్తుంది.దాంతో పెళ్లి తర్వాత తన పేరు చివర ఉన్న ట్యాగ్ కూడా తీసేస్తుందని ప్రచారం జరుగుతుంది.అంతేకాకుండా సంయుక్త మీనన్ డెవిల్ సినిమా తప్ప మరో సినిమాకి ఇప్పటివరకు ఓకే చేయలేదు.
అయితే పెళ్లికి సిద్ధమవడం వల్లే సంయుక్త మీనన్ వేరే సినిమాలకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.మరి చూడాలి సంయుక్త మీనన్ పెళ్లి వార్తల్లో ఎంత నిజం ఉందో.