టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారం అందించిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
బింబిసార సినిమాలో సంయుక్త మీనన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.సార్ మూవీలో కూడా సంయుక్త మీనన్ కు ఛాన్స్ దక్కింది.
మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో సైతం సంయుక్త మీనన్ నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి రాగా తాజాగా సంయుక్త మీనన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.మరోవైపు త్రివిక్రమ్ సంయుక్త మీనన్ కు వరుసగా అవకాశాలను ఇప్పిస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
త్రివిక్రమ్ మహేష్ కాంబో మూవీలో నేను నటిస్తున్నానని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని సంయుక్త మీనన్ చెప్పుకొచ్చారు.

నేను మహేష్ బాబు సినిమాలో నటించడం లేదని ఆమె తెలిపారు.ఇలాంటి రూమర్లను రాయాలంటే చాలా క్రియేటివిటీ ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.సార్ మూవీ షూట్ సమయంలో నాకు ధనుష్ కు విభేదాలు వచ్చాయని సెట్స్ నుంచి వెళ్లిపోయానని రాశారని ఆమె తెలిపారు.
ఈ రూమర్లను ఏ విధంగా పుట్టిస్తారో నాకు కూడా అర్థం కాదని ఆమె చెప్పుకొచ్చారు.అలాంటి వాళ్ల క్రియేటివిటీని మెచ్చుకోవాలని ఆమె కామెంట్లు చేశారు.

గతంలో రూమర్లు అంటే చాలా భయం వేసేదని ఇప్పుడు రూమర్లను ఎంజాయ్ చేయడం నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.సంయుక్త మీనన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.సంయుక్త మీనన్ క్లారిటీ ఇవ్వడంతో ఇకనైనా రూమర్లు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.త్రివిక్రమ్ సంయుక్తకు ఛాన్స్ లు ఇప్పిస్తున్నారని జరిగిన ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది.







