ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ F15 ( Samsung Galaxy F15 5G )పేరుతో బడ్జెట్ ధరలోనే 5జీ ఫోన్ తీసుకొచ్చింది.ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ వివరాలతో పాటు ధర వివరాలను తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ F15 5జీ స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్ 6.5 అంగుళాల full HD ప్లస్ సూపర్ AMOLED డిస్ ప్లే( AMOLED display ) తో వస్తోంది.90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది.ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ చిప్ సెట్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది.6000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే రెండు రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.5జీ, వైఫై, బ్లూటూత్ 5.3, GPS,USB టైప్-C లాంటి ఫీచర్లతో ఉంటుంది.ఈ ఫోన్ 50 మెగా పిక్సెల్ తో కూడిన రెయిన్ కెమెరాతో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఈ F15 5జీ స్మార్ట్ ఫోన్ కు కొత్త RAM వేరియంట్ ను తీసుకొచ్చింది.8GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది.4GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది.6GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది.ఇక సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఈ ఫోన్ పై రూ.1000 డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు.
మధ్యతరగతి బడ్జెట్లో శాంసంగ్ గెలాక్సీ F15 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండడం వల్ల భారత మార్కెట్లో ఈ ఫోన్ వివిధ కంపెనీలకు చెందిన ఫోన్లకు గట్టి పోటీ ఉందని శాంసంగ్ కంపెనీ భావిస్తోంది.