సంపూ పొలిటికల్‌ ఎంట్రీ!!!

బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘కొబ్బరి మట్ట’ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.రెండు చిత్రాలతోనే ఎక్కడికో వెళ్లిన సంపూ ‘కొబ్బరి మట్ట’తో మరింత క్రేజ్‌ను దక్కించుకోవడం ఖాయం అంటూ ఆయన అభిమానులు చెబుతున్నారు.

 Sampoornesh Babu Political Entry..?-TeluguStop.com

ప్రస్తుతం ‘కొబ్బరి మట్ట’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం గోదావరి జిల్లాలో జరుగుతోంది.ఈ సందర్బంగా ఈయన మాజీ కాంగ్రెస్‌ ఎంపీ హర్షకుమార్‌ ఇంట్లో కాసేపు సరదాగా గడిపాడు.

ఆ సమయంలో రాజకీయాల గురించి కూడా చర్చించారట.
ఆ విషయాన్ని సంపూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

తాను హర్షకుమార్‌ గారితో పలు విషయాలు చర్చించాను అంటూ ఆయన చెప్పడంతో ట్విట్టర్‌లో ఆయన్ను ఫాలో అయ్యే ఒక వ్యక్తి మరి రాజకీయ ఎంట్రీ ఎప్పుడు అంటూ ట్వీట్‌ చేశాడు.అందుకు సమాధానంగా త్వరలోనే ఉంటుంది సార్‌ అంటూ రీ ట్వీట్‌ చేశాడు.

మరి నిజంగానే సంపూ రాజకీయాల్లోకి వస్తాడా లేక జోక్‌గా ట్వీట్‌ చేశాడా అనేది చూడాలి.సంపూ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరతాడో మరి.సంపూ తెలంగాణకు చెందిన వ్యక్తి అనే విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube