సమంత ముందు బొక్క బోర్లా పడ్డ హీరో విశాల్.. ఇంత దారుణమా ?

సినిమా ఇండస్ట్రీ అంటేనే మెల్ సెంట్రిక్ ఇండస్ట్రీ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక్కడ హీరోనే సర్వస్వము.

హీరోయిన్ అంటే కేవలం హీరో కి సపోర్ట్ పాత్రా మాత్రమే.ఇక కొన్నాళ్ల నుంచి హీరోల బిల్డప్ సినిమాలు చూడలేకపోతున్నాం.

ఇక ఇదే టైం లో హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు కూడా రాజ్యమేలుతున్నాయి.హీరోల బిల్డప్ ముందు హీరోయిన్స్ గట్టిగా నిలబగలుగుతున్నారు.

అందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే సమంత పేరు ముందు గా చెప్పుకోవాలి.సమంత చివరి సినిమా యశోద.

Advertisement

ఈ సినిమా ఫిమేల్ లీడ్ గా సమంత ముందుకు తీసుకెళ్లి హిట్ కొట్టింది.పైగా ఈ సినిమా టైం లో సమంత ఆరోగ్యం ఏమాత్రం బాగో లేదు.

అయినా కూడా ఆమె ప్రమోషన్స్ చేయలేక ఇబ్బంది పడుతూనే సినిమా ను థియేటర్ లో వదిలింది.కేవలం థియేటర్ రన్ పైన 33 కోట్ల వసూళ్లు సాధిచింది.

ఇక ఓటిటి, శాటిలైట్ రైట్స్ తో కలిపి మంచి వసూళ్లను సాధించినట్టే.పైగా ఇది ఒక పాన్ ఇండియా సినిమా.

ఈ సినిమా కి ప్రస్తుతం సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆమె పూర్తి ఫోకస్ శాకుంతలం పైన పెట్టింది.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...

మరో వైపు హీరో విశాల్ పరిస్థితి చూస్తే అంతకంతకు దిగజారిపోయింది.తమిళం తో పాటు తెలుగు లో కూడా ఫ్యాన్స్ ఉన్న ఈ హీరో వరసగా సినిమాలను విడుదల చేస్తూ ఉన్నాడు.కానీ రొటీన్ కథలతో మూస విధానాలతో ఒకే విధమైన సినిమాలను చేస్తూ జనాలకు బోర్ కొట్టిస్తున్నాడు.

Advertisement

ఇక ఇటీవల అయన సినిమాలు టీవీ లో వచ్చిన కూడా చూసే నాధుడే లేడు.ఒక్క మాటలో చెప్పాలంటే రోజు రోజు కి పతనానికి చేరువలో విశాల్ కెరీర్ ఉంది,

మరో వైపు నిన్న మొన్న వచ్చిన హీరోలు కెరీర్ లో దూసుకుపోతున్నారు.మరి విశాల్ పరిస్థితి అద్వాన్నంగా ఉంది.ఇక మొన్నటి వారం లాఠీ సినిమా కి 35 కోట్లు ఖర్చు పెట్టగా వచ్చింది మాత్రం 18 కోట్లు మాత్రమే.

మొదటి వారం తమిళ్ లో పర్వాలేదు కానీ రెండవ వారం మరి 9 లక్షల లోపే వసూళ్లు ఉండటం బట్టి చూస్తే విశాల్ సినిమా పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.ఇక యశోద సినిమాను టీవిలో వేస్తే 5 రేటింగ్ రాగ విశాల్ సినిమా టీవిలో వేస్తే 3 రేటింగ్ వచ్చింది.

సమంత ముందు కూడా బొక్క బోర్లా పడ్డాడు విశాల్.

తాజా వార్తలు