ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సమంత నటించిన యశోద సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.టీజర్ లో సమంత గర్భవతి అని చూపించారు.
సినిమా మొత్తం కూడా సమంత గర్భవతి గానే కనిపించబోతున్నట్లుగా టీజర్ ని చూస్తుంటే అనిపిస్తుంది.ఒక గర్భవతిగా సమంత చాలా కష్టాలను సినిమాలో పడింది.
ఆ విషయాన్ని కాస్త ఎమోషనల్ గా ఇబ్బందికరంగానే చిత్ర యూనిట్ సభ్యులు చూపించారు.సమంత నుండి ఇలాంటి సినిమాలను మేము ఆశించడం లేదని.
మాకు ఇలాంటి సినిమాల్లో సమంతా ని చూడాలని లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సమంత ఒక మంచి కమర్షియల్ రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే సినిమాల్లో నటిస్తే చూడాలని.
స్టార్ హీరోలకు జోడిగా రొమాంటిక్ పాత్రలో నటిస్తే చూడాలని.
మోడ్రన్ డ్రెస్సుల్లో ఆమె నటిస్తే చూడాలని కోరుకుంటున్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే యూటర్న్ తో పాటు ఓ బేబీ లాంటి సినిమాల్లో సమంత నటించగా వాటిని కమర్షియల్ గా తిరస్కరించిన ప్రేక్షకులు యశోద సినిమాను కూడా పెద్దగా ఆదరించే అవకాశాలు లేవు అంటూ టీజర్ చూసిన తర్వాత కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ నటిగా సమంత కు ఈ సినిమా చాలా పెద్ద ఛాలెంజింగ్ అన్నట్లుగా ఉండబోతుందని కూడా కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతుంది.ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా కు ప్రదర్శన ఆకర్షణగా నిలుస్తుంది అంటూ యూనిట్ సభ్యులు చెప్తున్నారు.సినిమాలో సమంత పాత్ర తప్ప మరే పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదా.అందుకే టీజర్ లో ఆమెను మాత్రమే చూపించారు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి సమంత యశోద టీజర్ పై ఆమె అభిమానులు పెదవి విరవడంతో సినిమా ఫలితం ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.








