సమంత ముఖ్య పాత్రలో రూపొందుతున్న యశోద సినిమా విడుదల తేదీ విషయంలో గందరగోళం నెలకొంది.ఈ నెలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
కానీ షూటింగ్ కాస్త ఆలస్యం అవ్వడంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం అవుతున్న కారణంగా విడుదల వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.వాయిదా విషయాన్ని అధికారికంగా ప్రకటించిన యశోద టీమ్ ఇప్పటి వరకు సినిమా కొత్త విడుదల తేదీ విషయం లో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
దాంతో సమంత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇంకా ఎన్నాళ్లు సమంత సినిమా కోసం వెయిట్ చేయాలి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా సమంత యొక్క యశోద సినిమా టీజర్ విడుదల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
టీజర్ ను సెప్టెంబర్ 9వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
కనుక ఆ టీజర్ విడుదల తో పాటు సినిమా విడుదల తేదీ కూడా వస్తే బాగుంటుంది అని అభిమానులు అనుకుంటున్నారు.టీజర్ విడుదల అవుతుంది అంటే తప్పకుండా విడుదల తేదీ విషయం లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు.
సమంత మరో సినిమా శాకుంతలం సినిమా ను జనాలు మర్చే పోయినట్లుగా ఉన్నారు.ఆ సినిమా విడుదల ఇప్పుడు.అప్పుడు అంటూ ఏ ఊసు లేదు.కనీసం టీజర్ కూడా లేదు.
దాంతో సినిమా గురించి ఆలోచన లేదు.ఇప్పుడు అందరి దృష్టి కూడా యశోద మీదే ఉంది.
పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ సినిమా లో తమిళ స్టార్ వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.







