సమంత హీరోయిన్ గా నటించిన యశోద సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.
తెలుగు తో పాటు తమిళం, హిందీ మరియు కన్నడం భాషల్లో కూడా ఈ సినిమా ను విడుదల చేసిన విషయం తెల్సిందే.అన్ని భాష ల్లో కలిపి సినిమా మొదటి రోజు దాదాపుగా ఏడు కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమైన సమయంలోనే అంచనాలు భారీగా పెంచే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.సినిమా చివరి నిమిషం లో సమంత అనూహ్యంగా మయో సైటిస్ అనే దీర్ఘ కాలిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రమోషన్ కార్యక్రమాలకు ఆమె హాజరు కాలేక పోయింది.కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూలో సమంత కనిపించింది.అయినా కూడా సినిమా కు మంచి బజ్ క్రియేట్ అయింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేస్తుంది అంటూ అంతా భావించారు, కానీ పరిస్థితి చూస్తుంటే అలా లేదని తేలి పోయింది.
ఈ సినిమా 30 నుండి 35 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేస్తే గొప్ప విషయం అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది.

హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కనీసం కలెక్షన్స్ రాబట్ట లేక పోయింది.కేవలం తెలుగు బాక్సాఫీస్ వద్ద మాత్రమే ఈ సినిమా వసూళ్లు నమోదు అవుతున్నాయి.తమిళ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా ను పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఈ నేపథ్యం లో ఈ సినిమా కలెక్షన్స్ చూస్తూ ఉంటే ఫ్లాప్ అన్నట్లుగానే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. సమంత యశోద సినిమా ఎలాంటి అనుమానం లేకుండా ఫ్లాప్ అన్నట్లుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.