శాకుంతలం రిలీజ్ డేట్ వచ్చేసింది.. సామ్ ఎప్పుడు రాబోతుందంటే?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.

 Samantha Shaakuntalam Release Date Fixed, Shaakuntalam Release Date, Allu Arha,-TeluguStop.com

అయితే ఈమె వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే హెల్త్ ఇష్యు ఈమెను చుట్టూ ముట్టింది.తన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్న సమయంలోనే ఈమె అనారోగ్యం పాలు అయ్యింది.

దీంతో సమంత ఇండస్ట్రీకి కొద్దీ రోజులు పూర్తిగా దూరం అయ్యింది.

ఈమె అనారోగ్యానికి గురి అయినప్పటి నుండే ఎక్కడికక్కడ షూటింగులు ఆగిపోయాయి.

ఇక ఈమె ఇప్పుడిప్పుడే హెల్త్ ప్రాబ్లెమ్ నుండి బయట పడుతుంది.దీంతో ఈమె మళ్ళీ షూటింగులతో బిజీ కానుంది.

ఇక ఇటీవలే ఈమె నటించిన యశోద సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా ఈమె చేస్తున్న సినిమాల్లో మరో సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చారిత్రక సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ తన నెక్స్ట్ సినిమాను చేస్తుంది.భారీ సెట్టింగులతో పెద్ద బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

మరి ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అనౌన్స్ చేయలేదు.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

పాన్ ఇండియా వ్యాప్తంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17, 2023న థియేటర్ లలో రిలీజ్ కాబోతుంది.

ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ పై నీలిమ గుణ నిర్మించారు.ఇక ఈ సినిమాలో అల్లు అర్హ కూడా బాలనటిగా పరిచయం కాబోతుంది.మరి ఈ సినిమా భారీ సినిమాల మధ్యనే బరిలోకి దిగబోతుంది.

ఇదే సమయంలో ధనుష్ సార్ సినిమా, విశ్వక్ సేన్ ధమ్కీ, కిరణ్ సబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతుంది.ఈ సినిమా 2డితో పాటు 3డి వర్షన్ లో కూడా రిలీజ్ కాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube