అయ్యో.. అరునెలలు సమంత అంత కష్టపడిందా.. పాపం!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన కెరీర్ పైనే పూర్తిగా దృష్టి పెట్టింది.అంతేకాకుండా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతుంది.

విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో రకమైన కొటేషన్ లు షేర్ చేస్తూనే ఉంది.విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ చేసినా కూడా అది క్షణాల్లోనే వైరల్ అవుతోంది.

ఇక ఎప్పటిలాగే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది సమంత.ఈ క్రమంలోనే ఫియసింగ్ బాధ తగ్గిందా అని ఒక నెటిజన్ సమంత ను ప్రశ్నించగా.ఆ విషయంపై స్పందించిన సమంత ఆ ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతూ ఈ బాధ తగ్గడానికి ఆరు నెలలు సమయం పట్టింది అని చెప్పుకొచ్చింది.

Advertisement

ఇకపోతే సమంత తాజాగా నటించిన చిత్రం కాతు వాక్కుల రెండు కాదల్.ఈ సినిమాను తెలుగులో కన్మణి రాంబో ఖతీజా పేరుతో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో సమంతతో పాటు, నయనతార కూడా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు నయనతార ప్రియుడు విగ్నేష్ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.

విడుదల తేది దగ్గర పడుతుండటంతో సమంతా ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉంది.అయితే సమంత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లను ఎంజాయ్ చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు చేరువగా ఉంటోంది.

ఇకపోతే ఇటీవల సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసిన విషయం తెలిసిందే.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు