తెలుగు తెరపై చివరిసారిగా సమంత( Samantha ) ను అందరూ ఖుషి చిత్రంలోనే చూశారు.అంత కన్నా ముందు యశోద, శాకుంతలం వంటి సినిమాలో నటించిన కూడా ఇవన్నీ రెండు మూడేళ్ల క్రితం ఒప్పుకున్న సినిమాలు.
అయితే ఆమె దాదాపు ఒక సినిమాకు సైన్ చేసి రెండేళ్లు దాటిపోయింది.మరి అప్పటికే ఒప్పుకున్న సినిమాలకు అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేసి నాకు ఏడాది పాటు సమయం కావాలంటూ దర్శక నిర్మాతలను ప్రాధేయపడింది ఆమెకున్న ఆరోగ్య కారణాల రీత్యా ఇలా చేస్తుంది అనుకుని అందరూ సైలెంట్ అయిపోయారు.
దాంతో ఆల్మోస్ట్ సమంత అన్ని అవకాశాలను పక్కన పెట్టింది.అయితే ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో( Social media ) యాక్టివ్ అయింది ఈ మాజీ అక్కినేని కోడలు.

ఇక ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో అల్లు అర్జున్( Allu Arjun ) తన ఫేవరెట్ యాక్టర్ అంటూ అతడిని పొగిడే పని పెట్టుకుంది.దీన్ని చూసి అందరూ ఇప్పుడేంటి ఇలా పొగుడుతుంది అని అనుమానం వ్యక్తం చేశారు.అనుకున్నట్టుగానే ఆమె మరోసారి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయిపోతుందట.ఇక ఇప్పటికే అల్లు అర్జున్ తో ఊ అంటారా మామ ఉ ఊ అంటారా అంటూ దేశం మొత్తం ఉర్రూతలూగించిన సమంత మరోసారి పుష్ప సీక్వెల్లో( Pushpa Sequel ) కూడా జాన్వి కపూర్ తో కలిసి మెరిసిపోతుందట.
ఇలా తన రీఎంట్రీ అల్లు అర్జున్ తో అని తెలియగానే అటు బన్నీ ఫ్యాన్స్ ఇటు సమంత ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.ఇక తనకు వరస పెట్టి సినిమాలు చేసే ఉద్దేశం ఉంది అంటూ నిర్మాతలకు గాలం వేసే పనిలో ఉంది సమంత

మరి ఆమె ప్రయత్నాలు అన్నీ కూడా సక్సెస్ అయ్యి మరోసారి టాలీవుడ్ లో బిజీ అవుతుందా లేదా ప్యాన్ ఇండియా వైపు వెళ్లిపోయి అక్కడ సినిమాలు తీసుకునే పని పెట్టుకుంటుందా అనేది మరికొన్ని రోజుల పాటు వేచి చూస్తే తెలుస్తుంది.ఇప్పటికే టాలీవుడ్( Tollywood ) కన్నా బాలీవుడ్ బెటర్ అని ఫీల్ ఆమె అయినా కూడా ఆమెకు అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు.మరోమారు ప్రయత్నాలు చేసి రీ ఎంట్రీ లో సక్సెస్ అవ్వాలని తెగ ట్రై చేస్తుంది సమంత.
అందుకే ఉన్నపళంగా సోషల్ మీడియాను యాక్టివేట్ చేసింది.ఫోటోషూట్స్ అంటూ తెగ రెచ్చిపోతుంది.
మరి చూడాలి సమంత గాలానికి ఎంత మంది చిక్కుతారో?
.