సినీనటి సమంత( Samantha ) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.ఈమె సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకున్నారు.
అయితే సోషల్ మీడియా వేదికగా ఇటీవల తెలంగాణ మాజీ ఐటి మినిస్టర్ కేటిఆర్( KTR ) ఒక పోస్ట్ చేశారు.కేటీఆర్ చేసినటువంటి ఈ పోస్టుకు సమంత వెంటనే రియాక్ట్ అవుతూ కామెంట్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
ఇలా సమంత ఈ పోస్ట్ పై లైక్ చేస్తూ కామెంట్ చేయడంతో కేటీఆర్ చేసిన ఆ పోస్టులో అంత ప్రత్యేకత ఏముందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కేటీఆర్ సైతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన రాజకీయ విషయాలను మాత్రమే కాకుండా ఇతరత విషయాలపై కూడా ఈయన స్పందిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తన చుట్టూ కొంతమంది ఉండగా మధ్యలో ఈయన నవ్వుతూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.ఇక ఈ ఫోటోని షేర్ చేసినటువంటి కేటీఆర్ జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా.
చిరునవ్వుతో ఎదుర్కోవాలి అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఇక ఈ పోస్ట్ చేసిన వెంటనే సమంత ఈ పోస్ట్ పై లైక్ కొట్టడమే కాకుండా నమస్తే అని ఉన్నటువంటి ఎమోజిని షేర్ చేశారు.
కేటీఆర్ చేసినటువంటి ఈ పోస్ట్ పై సమంత ఇంత తొందరగా రియాక్ట్ అవ్వడానికి కారణం లేకపోలేదని చెప్పాలి.పరిస్థితులు ఎలా ఉన్నా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అంటూ ఆయన చేసిన పోస్టు సమంత జీవితానికి చాలా బాగా సూటవుతుంది.సమంత జీవితంలో కూడా ఎన్నో క్లిష్ట పరిస్థితులు వచ్చాయి అయితే వాటన్నింటినీ కూడా ఈమె ఎదుర్కొంటు ముందడుగు వేస్తూ వస్తున్నారు.కేటీఆర్ చేసినటువంటి పోస్ట్ ఆమె వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉండటంవల్లే సమంత స్పందించి కామెంట్ చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.