యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘అశ్వధ్ధామ’ మంచి అంచనాల నడుమ జనవరి 31న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.
సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజు మంచి వసూళ్లను సాధించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమాతో నాగశౌర్య భారీ విజయం అందుకోవాలని ఆశించాడు.
ఈ క్రమంలో సినిమాను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
ఈ సినిమాను తాజాగా స్టార్ బ్యూటీ సమంతతో ప్రమోట్ చేయించారు.
అశ్వధ్ధామ సినిమా బాగుందని, ప్రతిఒక్కరు చూడాల్సిందిగా సమంత తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కోరింది.ఈ ట్వీట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.
కాగా నాగశౌర్య ఈ సినిమాకు అందించిన కథను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.
రమణ తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు గిబ్రన్ అందించిన బీజీఎం బాగా రావడంతో సినిమాను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు జిష్షు సేన్‌గుప్తా.మెహ్రీన్ పీర్జాదా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మున్ముందు ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.







