సమంత హీరోయిన్( Samantha ) గా చాలా సినిమా ల్లో నటించింది.చాలా సినిమా ల్లో కేవలం గ్లామర్ షో కే పరిమితం అయ్యింది.
కొన్ని సినిమా ల్లో నటనతో మెప్పించింది.పుష్ప సినిమా లో మాత్రం తన అందంతో పాటు డాన్స్ ప్రతిభ ను చూపించడం ద్వారా సమంత తన సత్తా చాటింది.
ఊ అంటావా మావ పాట( Oo Antava Mawa Song ) ఏ స్థాయి లో సక్సెస్ ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.భారీ అంచనాల నడుమ రూపొందిన పుష్ప సినిమా లోని సమంత ఐటం సాంగ్ సూపర్ హిట్ అవ్వడం తో సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
జాతీయ స్థాయి లో సినిమా కు అంతటి ఆధరణ మరియు పేరు రావడానికి కారణం కచ్చితంగా సమంత యొక్క ఐటం సాంగ్ అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సమంత తెలుగు లో విజయ్ దేవరకొండ కు జోడీగా ఖుషి సినిమా లో నటిస్తోంది.మరో వైపు హిందీ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్( Citadel is a web series ) ను చేస్తున్న విషయం తెల్సిందే.ఇక ఈమె ఇంగ్లీష్ లో చెన్న స్టోరీస్ అనే సినిమా ను కూడా చేయబోతుంది.
ఇన్ని సినిమాలు చేస్తున్న సమంత తాజాగా మరో ఐటం సాంగ్ ను కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.అది కూడా ఒక తెలుగు సినిమా అనే పుకార్లు జోరుగా సాగుతున్నాయి.
ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా లో లేదా మరో స్టార్ హీరో సినిమా లో ఆ ఐటం సాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.సమంత తెలుగు లో ఐటం సాంగ్ చేయబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి…
కానీ ఆ పాట ఏ సినిమా లో అనేది మాత్రం ఎవరికి ఊహకు తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు.
పెద్ద ఎత్తున సమంత సినిమాలు చేస్తూ కూడా ఐటం సాంగ్స్ చేసేందుకు ఆసక్తి చూపడానికి కారణం వారం లేదా పది రోజుల షూట్ కి గాను కోట్ల రూపాయల పారితోషికం దక్కుతుంది.అందుకే సమంత ఈ పని కి ఓకే చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
