కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని భావించే ప్రతి వ్యక్తికి కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి.కంటిచూపు లేకపోతే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఒక యువకుడు మాత్రం కంటిచూపు లేకపోయినా తను కన్న కలలను సాకారం చేసుకున్నాడు.మధ్యప్రదేశ్( Madhya Pradesh ) రాష్ట్రానికి చెందిన యశ్( Yash ) సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు.
పుట్టుకతోనే గ్లుకోమాతో బాధ పడుతున్న యశ్ 8 సంవత్సరాల వయస్సు వచ్చే సమయానికి కంటిచూపును కోల్పోయాడు.అయితే తనకు లోపం ఉన్నా లక్ష్య సాధనకు ఆ లోపం సమస్య కాకూడదని యశ్ భావించాడు.
ప్రస్తుతం యశ్ వయస్సు 26 సంవత్సరాలు కాగా యశ్ తండ్రి సొనాకియా చిన్న క్యాంటీన్ ను నిర్వహిస్తూ జీవనం సాగించేవారు.ప్రత్యేక పాఠశాలలో ఐదో తరగతి వరకు యశ్ చదువుకున్నాడు.
స్క్రీన్ రీడింగ్ అనే సాఫ్ట్ వేర్ సహాయంతో యశ్ 2021 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశాడు.ఆ తర్వాత కోడింగ్ నేర్చుకున్న యశ్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు.మైక్రోసాఫ్ట్( MicroSoft ) ఆన్ లైన్ పరీక్షతో పాటు ఇంటర్వ్యూను పూర్తి చేసిన యశ్ ఉద్యోగానికి ఎంపికై విజేతగా నిలిచారు.ప్రస్తుతం బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో యశ్ ఉద్యోగం చేస్తున్నారు.47 లక్షల రూపాయల ప్యాకేజీతో యశ్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం గమనార్హం.
యశ్ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.కష్టపడితే కెరీర్ పరంగా విజయాలను సొంతం చేసుకోవచ్చని యశ్ ప్రూవ్ చేస్తున్నారు.యశ్ సక్సెస్ స్టోరీ కొంతమందికి కన్నీళ్లు పెట్టిస్తోంది.
యశ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యశ్ ఎదిగిన తీరును ఎంతోమంది మెచ్చుకుంటున్నారు.
కష్టపడితే సక్సెస్ సాధించడం కష్టం కాదని యశ్ భావిస్తుండటం గమనార్హం.తన ప్రతిభతో యశ్ కెరీర్ పరంగా ఎదిగారు.