దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
అదేవిధంగా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.ఇదిలా ఉండగా ప్రియమణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి ముఖ్యంగా సమంత గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఒకప్పుడు సినిమాలకు ప్రస్తుత సినిమాలకు ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని,ఒకప్పుడు హీరోయిన్ అంటే స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేయడానికి మాత్రమే పరిమితమయ్యే వారని కానీ ప్రస్తుతం హీరోలకు అనుగుణంగా హీరోయిన్లకు ప్రాధాన్యత లభిస్తుందని అలాంటి పాత్రలో నటించడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు.ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా సమంత నయనతార ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు.
ఇక తాజాగా సమంత నటించిన పుష్ప ఐటమ్ సాంగ్ గురించి ఈమె మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు.ఈ పాటలో సమంత కేవలం తనకు మాత్రమే కాకుండా తన భర్తకి కూడా చాలా హాట్ గా కనిపించిందని ఈమె సమంత పై కామెంట్ చేశారు.పెళ్లి తర్వాత పలు సినిమాలలో ఎంతో బిజీగా ఉన్న ప్రియమని త్వరలోనే ఆహా’లో ప్రసారం కానున్న తెలుగు వెబ్ సిరీస్ ‘భామా కలాపం’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది.