శాకుంతలం పోస్టర్ వదిలిన సమంత.. ఆ మాటతో అవమానపరిచిన నెటిజన్?

సినిమా అనేది ఒక నిజమైన ఊహలాగా ఉంటుంది.నిజంగా సినిమా చూస్తున్నంతసేపు ఆ సినిమా ప్రపంచంలో మునిగిపోయినట్లుగా ఉంటుంది.

 Samantha Left The Sakunthalam Poster ,samantha,shakunthalam Poster,tollywood ,be-TeluguStop.com

అదే సీరియల్ మాత్రం అలా ఉండదు.సీరియల్ చూస్తున్నంత సేపు ఆ లోకం మరోలా ఉంటుంది.

కథ సాగదీసినట్లు, బాగా ఎమోషన్స్, డ్రామా అనేది కట్టిపడి ఉంటుంది.నిజానికి సినిమాకు, సీరియల్ కు తేడా అనేది చాలా ఉంటుంది.

అందుకే ఈ రెండు ఎప్పుడు కలవవు.కానీ తాజాగా ఓ నెటిజన్ సమంత సినిమాను ఏకంగా సీరియల్ తో పోల్చి షాకిచ్చారు.

ఇంతకూ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకొని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ సమంత.

తన అందంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుని వారిని అభిమానులుగా మార్చుకుంది.నటన పరంగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏ మాయ చేసావే సినిమాతో పరిచయమైంది.

ఈ సినిమాలో తన నటనకు మార్కులు రావటంతో ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తూ వచ్చింది.

ఇక మధ్యలో ఎన్నో గుర్తింపులు, ఎన్నో గాసిపులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

తనతో కలిసి నటించిన నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోగా నాలుగేళ్లకే అతనికి విడాకులు ఇచ్చేసింది.విడాకుల తర్వాత తనేంటో, తన లైఫ్ ఏంటో చూసుకుంటూ ఒక బాధ్యతగా కొనసాగుతుంది.ఇక గత ఏడాది సమంత యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఎంతైనా సక్సెస్ అందుకుందో చూసాం.

ఇక ఈ ఏడాది శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.విడాకుల తర్వాత సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తూ బాగా రిఫ్రెష్ అయింది.ఆ మధ్య తను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపి మళ్లీ మొన్నటి వరకు పోస్టులు షేర్ చేయకుండా సైలెంట్ గా ఉండిపోయింది.

ఇక ఇటీవలే తను నటించిన శాకుంతలం సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా ఆ సమయంలో సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి అప్డేట్లు అందించింది.అప్పటినుంచి ప్రతిరోజూ ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంది.అయితే తాజాగా శాకుంతలం సినిమాకి సంబంధించిన మరో పోస్టర్ ను షేర్ చేసుకుంది.ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా ఆ పోస్టర్ చూసిన తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.

ఇక ఓ నెటిజన్ మాత్రం ఏ ఛానల్ లో వస్తది ఈ సీరియల్ అంటూ శాకుంతలం సినిమాను దారుణంగా అవమానించారు.ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవ్వగా సమంత అభిమానులు బాగా ఫైర్ అవుతున్నారు.

అంత పెద్ద సినిమాని సీరియల్ తో పోలుస్తావా అంటూ ఫైర్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube