రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో చోటు దక్కించుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా ఈ పాట నామినేషన్ లో నిలిచింది.
అయితే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఎంఎం కీరవాణి స్వరాలు అందించిన ఈ పాటను ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ రచించారు.
ఈ క్రమంలోనే ఈ పాట ఆస్కార్ నామినేషన్ లో నిలవడంతో ఈ విజయం పై చంద్రబోస్ స్పందించారు.

ఈ సందర్భంగా చంద్రబోస్ ఈ విషయంపై స్పందిస్తూ RRR సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్ నామినేషన్ లో ఉండడం చాలా ఆనందంగా ఉంది.అయితే ఈ విజయాన్ని తాను తలకెక్కించుకోను అంటూ స్పష్టం చేశారు.ఆస్కార్ జాబితాలో ఈ సినిమాని చూడటం చాలా గర్వంగా ఉంది.
తాను ఇంత ఎత్తుకు ఎదుగుతానని ఎప్పుడూ ఊహించలేదు.ఈ అవకాశం కల్పించిన కీరవాణి గారికి రాజమౌళి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చంద్రబోస్ వెల్లడించారు.

తెలుగు సినిమాలు ఇలా జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఇంత మంచి ఆదరణ సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉంది.ఇక ఈ పాట ఇంత మంచి విజయం అందుకోవడం వెనుక అందరి కృషి ఉందని తెలిపారు.మార్చి నెలలో జరగబోయే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని ఈ సందర్భంగా చంద్రబోస్ నాటు నాటు ఆస్కార్ నామినేషన్ పై స్పందించి తన అభిప్రాయాలను సంతోషాన్ని వెల్లడించారు.అయితే ఈ పాటను రాసేటప్పుడు తన జీవితంలో తన కుటుంబంలో జరిగిన సన్నివేశాలను అక్షర రూపంలో రాసి ఈ పాటను సృష్టించినట్లు ఈయన వెల్లడించారు.







