బాలీవుడ్ లో సమంత రేంజే వేరు.. ఆ విషయంలో ఆమెనే ఫాలో అవుతున్న సెలబ్రేటీస్?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప.ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీ విడుదల అయినప్పటికీ ఇప్పటికీ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా పెద్ద ఎత్తున ప్రదర్శితం అవుతూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

 Samantha Item Song Oo Antava From Pushpa Gone Viral With Several Celebs , Bollyw-TeluguStop.com

ముఖ్యంగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ముఖ్యంగా ఇందులో సమంత నటించిన ఐటమ్ సాంగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మొట్టమొదటిసారిగా సమంత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో నటించారు. “ఊ అంటావా మావా” అంటూ సమంత మాస్ స్టెప్పులతో అదరగొట్టిందని చెప్పవచ్చు.ప్రస్తుతం ఈ పాటకు ఎక్కడ చూసినా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.ఎంతో మంది ముద్దుగుమ్మలు ఈ పాటకు డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం సమంతనే ఫాలో అవుతూ ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఈ పాటను హిందీలో ఊ బోలెగా గీతాన్ని ఆలపించిన కనికా కపూర్ ‘క్యూట్’ అంటూ రీసెంట్‌గా వ్యాఖ్యానించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎప్పుడూ కూడా ఆడవారిపై పాటలు రాస్తుంటారు కానీ ఇలా మగవారిపై పై పై రాయడం చాలా బాగుంది అంటూ స్పందించారు.ఈమెతో పాటు బాలీవుడ్ టాలెంటెడ్ సింగర్ నేహా కక్కర్ పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ పై స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ సినిమా పై నా అభినందనలు తెలియజేయడానికి నేను చేయగలిగినది ఇదే అంటూ సముద్రతీరాన ఇసుకలో సమంత వేసిన మాస్ స్టెప్పులు వేస్తూ ఈ పాట పై ప్రశంసలు కురిపించారు.ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అలాగే బిగ్ బాస్ బ్యూటీ ఉర్పీ జావేద్ సైతం ఈ పాటకు స్టెప్పులు వేయడంతో ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube