టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత శాకుంతలం( Shaakuntalam ) సినిమా ప్రమోషన్ సందర్భంగా చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.సినిమా పబ్లిసిటీ లో భాగంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతూ ఉంటే మరి కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
మొత్తానికి శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల జోరు మామూలుగా లేదు.ఆ మధ్య విడాకుల విషయంలో తన తప్పు అస్సలు లేదు.
వంద శాంతం నేను వైవాహిక బంధం లో సరిగా ఉండేందుకు ప్రయత్నించాను అంటూ చెప్పుకొచ్చింది.అంతే కాకుండా విడాకుల తర్వాత తాను సినిమాల్లో చేయడాన్ని కూడా కొందరు విమర్శించారు అంటూ చెప్పుకొచ్చింది.తాజాగా సమంత మీడియా( Samantha ) తో మాట్లాడుతూ గడిచిపోయిన కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృదా చేసుకోవాలని అనుకోవడం లేదు.ఆమె ఇంకా మాట్టాడుతూ ఆ విషయాలను గురించి ఆలోచిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవాలని అనుకోవడం లేదు.
తప్పకుండా ముందు ముందు ఆ విషయాలను పూర్తిగా మర్చి పోతాను అంటూ చెప్పుకొచ్చింది.గడచి పోయిన విషయాలను తల్చుకుంటూ ఉంటే జీవితం నాశనం అవ్వడం తప్ప మరేం లేదు అన్నట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.అసలు ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన ఏ ఒక్క చేదు అనుభవాలను గుర్తు పెట్టుకోవాలని తాను కోరుకోవడం లేదని కూడా ఆమె పేర్కొంది.శాకుంతలం సినిమా సక్సెస్ అయితే ముందు ముందు భారీ పాన్ ఇండియా సినిమాలను చేస్తానంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
మరో వైపు హిందీ లో ఈమె చేస్తున్న సినిమాలు మరియు సిరీస్ లు( Web series ) వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఇటీవలే ఈమె తమిళం లో ఒక భారీ ప్రాజెక్ట్ లో నటించేందుకు గాను ఓకే చెప్పింది అనే వార్తలు వస్తున్నాయి.
ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.