మొత్తం భారం 'ఖుషి' మీదే అంటున్న సమంత

స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం( Shakunthalam ) సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమా కలెక్షన్స్ పై సమంత చాలా ఆశలు పెట్టుకుంది.

కానీ శాకుంతలం సినిమా కలెక్షన్స్ మరీ దారుణంగా నమోదు అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.భారీ అంచనాల నడుమ గుణశేఖర్( Gunasekar ) దర్శకత్వం లో రూపొందిన శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన కలెక్షన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లుగా పరిస్థితి ఉంది.సమంత శాకుంతలం సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా తెలుగు లో భారీ లేడీ ఓరియంటెడ్ సినిమా లను చేయాలని ఆశ పడింది.

కానీ ఇప్పుడు శాకుంతలం సినిమా నిరాశ పర్చడం తో ఆమె పరిస్థితి ఏమిటో అంటూ అంతా చర్చించుకుంటున్నారు.

Advertisement

ఆకట్టుకునే కథ మరియు కథనాలతో ముద్దుగుమ్మ శాకుంతలం చేశాం.సినిమా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించింది.కానీ ఆ సినిమా నిరాశ పర్చడం తో ప్రస్తుతం తాను చేస్తున్న ఖుషి( Khushi ) చిత్రం పై నమ్మకం పెట్టుకొని వెయిట్ చేస్తుంది.

విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరో గా శివ నిర్వాణ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా లో సమంత కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ కథ ను తానే స్వయంగా రాయించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా సక్సెస్ అయితేనే సమంత సౌత్‌ సినిమా కెరియర్ ముందుకు సాగుతుంది అనే ప్రచారం జరుగుతుంది.ముఖ్యంగా టాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వాలంటే కచ్చితం గా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా కు సంబంధించిన విడుదల తేదీ ఇప్పటికే వచ్చింది.ఈ సంవత్సరంలోనే ఆ సినిమా తో కూడా సమంత తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

మరో వైపు బాలీవుడ్ లో సినిమాలు మరియు సిరీస్ లతో బిజీగా ఉంది.

Advertisement

తాజా వార్తలు