మరికొన్నాళ్లు వాళ్లని వెయిట్ చేయమంటూ విజ్ఞప్తి చేస్తున్న సమంత

సమంత మయో సైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న విషయం తెల్సిందే.గతంతో పోల్చితే సమంత ఇప్పుడు చాలా బెటర్‌ అయ్యింది.

 Samantha Dont Want To Join Shootings This Month , Kushi ,samantha,shakunthalam ,-TeluguStop.com

ఆమె ఆరోగ్యం విషయంలో అభిమానులు చాలా వరకు ఊపిరి పీల్చుకుంటున్నారు.ఆమె మళ్లీ తిరిగి యధా విధిగా సినిమాలు చేస్తుంది అంటూ ప్రతి ఒక్కరు చాలా నమ్మకంతో ఉన్నారు.

ఈ సమయంలో ఈమె యొక్క కొత్త సినిమాల షూటింగ్‌ విషయమై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Guna Shekhar, Kushi, Sakunthalam, Samantha, Shakunthalam-Movie

ఆ మధ్య శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో సమంత కనిపించడం తో ఇక షూటింగ్‌ లో కూడా సమంత కనిపించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.నిజంగానే సమంత జనవరి చివరి నుండి షూటింగ్స్ లో జాయిన్ అవుతాను అంటూ తాను నటిస్తున్న చిత్ర యూనిట్‌ సభ్యులకు తెలియజేసిందట.కానీ ఇటీవల ఆమె మళ్లీ తాను నటిస్తున్న సినిమా మేకర్స్ కు మరి కొన్ని రోజులు సమయం కావాలంటూ విజ్ఞప్తి చేసిందట.

అంతా బాగానే ఉంటే ఫిబ్రవరి లో శాకుంతలం సినిమా విడుదల కాబోతుంది.ఆ సినిమా విడుదల తర్వాత షూటింగ్‌ లకు సమంత హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Guna Shekhar, Kushi, Sakunthalam, Samantha, Shakunthalam-Movie

వారం నుండి పది రోజుల పాటు సమంత శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా దర్శకుడు గుణ శేఖర్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వచ్చిన శాకుంతలం సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతున్న నేపథ్యంలో సమంత ఫ్యాన్స్ హ్యాపీ.ఆమె మళ్లీ షూటింగ్స్ తో బిజీ అయ్యి వెంటనే ఆమె నటించిన సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.సమంత ఖుషి సినిమా లో విజయ్ దేవరకొండ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా వచ్చే నెలలో పున: ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube