సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఆమె కటౌట్లే చెపుతున్నాయి.పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసి పాన్ ఇండియా లెవల్లో ఓ ఊపు ఊపేసిన సమంత.
ఇప్పుడు యశోద చిత్రం తో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సరోగసీ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీలో సమంత టైటిల్ రోల్‌ని పోషించగా.
హరి, హరీష్ దర్శకత్వం వహించారు.శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు.
ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ప్రమోషన్స్ సినిమా ఫై అంచనాలు పెంచగా.తాజాగా సమంత తాలూకా భారీ కటౌట్లు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లలో సందడి చేస్తున్నాయి.
మాములుగా పెద్ద హీరోలకు మాత్రమే అభిమానులు ఇలా థియేటర్స్ వద్ద భారీ కటౌట్లు ఏర్పట్లు చేస్తారు.కానీ సమంత కు కూడా భారీ కటౌట్లు ఏర్పట్లు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు.హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద సమంత భారీ కటౌట్‌ని అభిమానులు ఏర్పాటు చేశారు.2019లోనూ ఇలానే ఓ బేబీ సినిమా రిలీజ్‌కి ముందు సమంత కటౌట్‌ని దేవీ 70 ఎంఎం థియేటర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది.కేవలం మెయిన్ థియేటర్ దగ్గరే కాదు తెలుగు రాష్ట్రాల్లో యశోద ఆడుతున్న థియేటర్స్ అన్నిచోట్ల సమంత కటౌట్స్ ప్రత్యక్షమయ్యాయి.సమంత క్రేజ్ చూసి మిగతా హీరోయిన్స్ కి నిద్రపట్టడం లేదని చెప్పొచ్చు.







