'ఖుషి' రిలీజ్ డేట్ అనౌన్స్.. విజయ్ - సమంత పోస్టర్ అదిరింది!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay deverakonda) హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ( Samantha ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ మూవీ ‘ఖుషి‘( Kushi ).ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్టర్ చేస్తున్నాడు.

 Samantha And Vijay Deverakonda's Kushi Release Date Fix, Vijay Devarakonda,  Tol-TeluguStop.com

సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా గత కొన్ని నెలలుగా షూట్ ఆగిపోయింది.అయితే ఈ సినిమా షూట్ మళ్ళీ ఎన్నో నెలల గ్యాప్ తర్వాత స్టార్ట్ అయ్యింది.

లైగర్ సినిమా ప్రమోషన్స్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూట్ ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం అంటే సమంత హెల్త్ కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడుతూ వస్తుంది.ఇటీవలే సామ్ హెల్త్ కూడా సెట్ అవ్వడంతో విజయ్, సమంత ఎట్టకేలకు సెట్ లో అడుగు పెట్టారు.

దీంతో మళ్ళీ శరవేగంగా షూట్ జరుపు కుంటుంది.ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు మేకర్స్.

కొద్దిసేపటి క్రితం సరికొత్త పోస్టర్ ద్వారా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఖుషి సినిమాను సెప్టెంబర్ 1, 2023న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ మెంట్ ఇవ్వడంతో రౌడీ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సమంత ఫ్యాన్స్ కు ఖుషీగా ఉన్నారు.ఇక ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ, సమంత అదిరిపోయారు అనే చెప్పాలి.

రెండు ప్రపంచాలు సెప్టెంబర్ 1, 2023న కలుస్తాయి అని పోస్టర్ రిలీజ్ చేయగా ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తుండగా.వెన్నెల కిషోర్, జయరామ్, మురళీ శర్మ వంటి వారు కీ రోల్స్ పోషిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్-సమంత ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube