టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కేసులో నిందితుల సిట్ కస్టడీ ముగిసింది.దీంతో నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు అధికారులు.
మొదట అరెస్ట్ చేసిన తొమ్మిది మందితో పాటు మరో ముగ్గురిని సిట్ అధికారులు ధర్మాసనానికి తరలించారు.ఈ క్రమంలో వారిని న్యాయస్థానం రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.
తొమ్మిది మంది నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని తెలిపింది.ఈ నేపథ్యంలో నిందితులను కింగ్ కోఠి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు.
మరోవైపు నిందితులకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.







