సమంత జీవితంలో ఎవరికి భయపడుతుందో తెలుసా ?

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే.సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగి దశాబ్ద కాలం పాటు ఏకచత్రాధిపత్యం చేసింది.

 Samantha About Her Mother , Samantha , Mother, Tollywood, Nagachaitanya, Jr Nt-TeluguStop.com

ఇక నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సైతం హీరోయిన్ గా నటించి అందరిని ముక్కున వేలేసుకునేలా చేసింది.కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు సైతం ప్రాధాన్యత ఇస్తూ అంచలంచలుగా పెంచుకుంటూ వెళ్ళింది.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్ లు అలాగే సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

మరోవైపు నాగచైతన్యతో విడాకులు తీసుకుని టాలీవుడ్ లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

ఆమె ఏం చేసినా తప్పు అన్నట్టుగా అక్కినేని అభిమానుల వైఖరి ఉండడంతో అసలు సోషల్ మీడియాకి కాస్త దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయింది సమంత.ప్రస్తుతం భర్తతో విడిపోయి తన విల్లాలో తన తల్లితో కలిసి ఒంటరిగానే జీవిస్తుంది.

అయితే సమంత తల్లి విషయంలో టాలీవుడ్ లో ఒక రూమర్ చెక్కర్లు కొడుతోంది.ఆమె హైదరాబాదులో ఉన్న సమయంలో సమంత ఇంటికి ఎవరైనా వెళ్లాలంటే వణికి పోతారట.

సమంత తల్లి చాలా స్ట్రిక్ట్ గా ఉండడంతో పాటు బయట వాళ్ళు ఇంటికి వస్తే అసలు ఒప్పుకోదట.

Telugu Hyderabad, Jr Ntr Show, Kushi, Mother, Nagachaitanya, Samantha, Tollywood

దాంతో సమంత తల్లి హైదరాబాదులో ఉంది అంటే చాలు అటు సైడ్ వెళ్లడానికి ఎవరైనా కూడా ధైర్యం చేయరట.అంతేకాదు సమంత సైతం రెండూ కుక్కలను పెంచుతోంది అందులో ఒకటి ఫ్రెంచ్ బుల్ డాగ్ కాగా మరొకటి పిగ్ బుల్ డాగ్.సాధారణంగా పిక్ బుల్ డాగ్ చాలా భయంకరంగా ఉంటుంది.

దాంతో ఎవరు ఉన్నా లేకున్నా ఆ సమంత ధైర్యంగా ఉండడానికి తన కుక్కలు బాగా సహాయం చేస్తాయని చెబుతోంది.అంతేకాదు తన తల్లి లాగా తాను కూడా ఎంతో ధైర్యవంతురాలిని అని, కానీ తనకు తన తల్లి అంటే ఎంతో భయమని ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ తో ఒక షో లో తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలను పంచుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube